ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గరుడ వాహనసేవకు టీటీడీ భారీ ప్రణాళిక- మూడున్నర లక్షల భక్తులకు సరిపడేలా ఏర్పాట్లు - garuda vahana seva arrangements - GARUDA VAHANA SEVA ARRANGEMENTS

మూడువేల ఆర్టీసీ ట్రిప్పులతో తిరుమలకు భక్తులను తీసుకొస్తామన్న టీటీడీ ఈవో

Garuda_Vahana_Seva
Garuda Vahana Seva (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2024, 7:58 PM IST

Updated : Oct 6, 2024, 9:38 PM IST

Garuda Vahana Seva Arrangements: కలియుగ వైకుంఠనాధుడు తిరుమల శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి వారికి ఘనంగా నిర్విహించే గరుడ వాహన సేవ కోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గరుడ సేవను తిలకించేందుకు లక్షలాది తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ భద్రతాధికారులతో కలిసి ఏర్పాట్లు చేశారు. సోమవారం అర్థరాత్రి నుంచి కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలను నిషేధించటంతో పాటు, కొండ కింద అలిపిరి వద్ద వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అని ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు తెలిపారు. గరుడ సేవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమావేశం నిర్వహించారు. మాడ వీధుల గ్యాలరీ 2 లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు వీలు ఉందన్నారు. ఇన్నర్, ఔటర్ రింగు క్యూలైన్ మాడవీధుల మూలల కూడలికి చేరుకొని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.

1250 మంది టీటీడీ విజిలెన్స్, 5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరా నిఘాలో తిరుమల మొత్తం మానిటరింగ్ చేస్తామన్నారు. మంగళవారం జరిగే గరుడ సేవకు గ్యాలరీలో భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేస్తామన్నారు. గరుడ సేవ రోజున మాడవీధుల్లో బయట ఉన్న భక్తులకు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయన్నారు.

మూడువేల ఆర్టీసీ ట్రిప్పులతో తిరుమలకు భక్తులను తీసుకొస్తామని వెల్లడించారు. సాయంత్రం 6.30 నుంచి 11.30 వరకు గరుడ వాహనసేవ జరగనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. అదే విధంగా తిరుమలపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు భక్తులు నమ్మవద్దని భక్తులను ఈవో కోరారు.

తిరువీధుల్లో కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడి విహారం- ఒక్కసారి దర్శిస్తే చాలు​! - Tirumala Srivari Brahmotsavam

Tirupati SP on Garudaseva: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. ఐదు వేల మంది పోలీసు బలగాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. గరుడ సేవ రోజున మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు ఎస్పీ తెలిపారు.

తిరుమలలో ఎనిమిది వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉందని, ఎనిమిది వేల అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు హోల్డింగ్స్ పాయింట్స్ వాహనాలను పార్కింగ్ చేసుకొని ఆర్టీసీ బస్సు ద్వారా తిరుమలకు రావాలన్నారు. రద్దీ దృష్ట్యా తిరుమల ఘాట్ పై సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ద్విచక్రవాహనాలను టీటీడీ నిషేధించింది. గరుడ సేవ రోజున గ్యాలరీలోకి వచ్చే భక్తులు లగేజీ లేకుండా చేరుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. గరుడ వాహన సేవను ప్రశాంతంగా తిలకించేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వాహనాల పార్కింగ్​కు ప్రత్యేక ఏర్పాట్లు: సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చే భక్తులకు, స్థానికుల వాహనాలకు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ కేటాయించారు. అలిపిరి సమీపంలోని దేవలోక్‍ ప్రాంతంలో టూరిస్ట్ బస్సుల కోసం, భారతీయ విద్యాభవన్‍, నెహ్రూ మున్సిపల్‍ మైదానం, వినాయక నగర్‍ క్వార్టర్స్​లో నాలుగు చక్రాల వాహనాలు, పాత అలిపిరి చెక్‍ పాయింట్‍ వద్ద ద్విచక్ర వాహనాలను పార్కింగ్‍ చేసుకునేలా టీటీడీ ఏర్పాటు చేసింది.

ద్విచక్రవాహనాల పార్కింగ్ కోసం అధికారులు అలిపిరి పాత తనిఖీ కేంద్రం వద్ద రెండు పార్కింగ్ ప్రదేశాలను కేటాయించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడ తమ వాహనాలను పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా కొండపైకి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాలను వీలైనంత మేర అలిపిరి వద్దే నిలిపివేయటం ద్వారా కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు కొండకు చేరుకునేలా చర్యలు చేపడుతున్నట్లు పోలీస్‍ అధికారులు చెబుతున్నారు.

సింహ వాహనంపై తిరుమల శ్రీవారు ఎందుకు విహరిస్తారో తెలుసా? - Tirumala Srivari Brahmotsavam

Last Updated : Oct 6, 2024, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details