ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గంజాయి, బ్లేడ్​ బ్యాచ్​ల బారి నుంచి మా కాలనీని కాపాడండి' - Ganjai Blade Batch in Vijayawada - GANJAI BLADE BATCH IN VIJAYAWADA

Ganjai And Blade Batch in JNNURM Colony in Vijayawada City : ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్‌ పేరే వినిపిస్తోంది. ఆ చెడ్డపేరును తొలగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు విజయవాడ నగర శివారు కాలనీ ప్రజలు తమ ఇళ్లలోకి గంజాయి, బ్లేడ్​ బ్యాచ్​లు చొరబడి కలకలం రేపుతున్నాయని వాపోతున్నారు.

ganjai_and_blade_batch_in_jnnurm_colony_in_vijayawada_city
ganjai_and_blade_batch_in_jnnurm_colony_in_vijayawada_city (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 2:29 PM IST

Ganjai And Blade Batch in JNNURM Colony in Vijayawada City : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు జక్కంపూడి జేఎన్​ఎన్​యూఆర్​ఎమ్​ కాలనీలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు శృతి మించిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎప్పుడు ఏ విధంగా వారు తమపై దాడికి దిగుతారో తెలియటం లేదని స్థానికులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అధికారులు దాడులు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని బాధితులు నిరసన బాట పట్టారు.

తాము పనులకు వెళ్లి బయట నుంచి ఇంటికి చేరేలోపు చీకటి పడుతుందని, ఆ సమయంలో గంజాయి, బ్లేడ్​ బ్యాచ్​లు తమపై దాడికి పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. స్థానిక మహిళలు భయంభయంగా బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు కాలనీలోకి రావడానికి భయపడుతున్నాయని తలిపారు. ఎప్పుడైనా వస్తే అకారణంగా సిబ్బందిపై గంజాయి బ్యాచ్ గొడవలకు దిగుతున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు.

People Facing Problema with Ganjai And Blade Batches :టిఫిన్ సెంటర్లు, ఇతర నిత్యావసర దుకాణాల ముందు రౌడీయిజం చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పోలీసుల నిఘా పెంచాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.


35 కేసులలో నిందితుడు - వాంటెడ్‌ క్రిమినల్‌ కొండా రమేష్‌ అరెస్టు - GANJA GANG ARRESTED


ఇదిలా ఉండగా మరోవైపు గంజాయి నియంత్రణకు యాంటీ నార్కొటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏఎన్‌టీఎఫ్‌) ఏర్పాటు చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు గతంలో చెప్పడం తెలిసిందే. బుధవారం సైబర్‌ క్రైమ్, గంజాయి కేసులు, పారిశ్రామిక ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలపై ఉత్తరాంధ్ర పోలీసు అధికారులతో ఆయన విశాఖలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గంజాయి కింగ్‌పిన్స్‌ను కట్టడి చేయడమే ఏఎన్‌టీఎఫ్‌ ప్రధాన లక్ష్యమని, ఆ బాధ్యతల్ని ఐజీ ఆకే రవికృష్ణకు అప్పగించామని తెలిపారు. గంజాయి సాగు వెనుక మావోయిస్టుల సహకారం కొట్టేయలేం కానీ, కొంతమంది వ్యాపారులే పెట్టుబడి పెట్టి సాగు చేయిస్తున్నట్లు గుర్తించామన్నారు.

అరకు టూ దిల్లీ - 22కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్​ - Police Seized 22kg of Ganja

ABOUT THE AUTHOR

...view details