Ganja Batches Attack Each other in Guntur District :గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో గంజాయి బ్యాచ్‌లు కత్తులు, సీసాలు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు. ఆదివారం రాత్రి (Sep 15) ఒక దుకాణం వద్ద ఉన్నప్పుడు నంబూరు మార్గం నుంచి బైక్‌పై వచ్చిన సందీప్, వంశీలు అక్కడ ఉన్న షేక్ ఆసిఫ్‌రాహెల్ కాలిపైకి ఎక్కించారు. ఇదేంటన్ని ప్రశ్నించినందుకు సందీప్ సీసాతో అతన్ని కొట్టారు. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయమైంది. చెవి, ఛాతీపై కత్తితో పొడిచినట్లు అతడు ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా అడిగినందుకు అతని సోదరుడు అల్తాఫ్‌హుస్సేన్‌పైనా కత్తితో దాడి చేశారు. దీంతో అతని దవడ భాగంలో లోతుగా గాయమైంది. ఇది వాస్తవం కాదని, తాము బైక్‌పై వస్తుండగా రాహెల్, అల్తాఫ్ ఆపి గొడవ పెట్టుకున్నారని సందీప్ తెలియజేశారు. తమల్ని కర్రలతో కొట్టారని అతడు చెబుతున్నాడు. సందీప్ వీపుపై పలుచోట్ల, నుదురు, ఛాతీపై కర్రలతో కొట్టిన గుర్తులున్నాయి. బైక్‌పై ఉన్న కూడా వంశీకి గాయాలయ్యాయి.
డోన్‌లో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Leaders Attack
ఇరు వర్గాలవారూ ఎవరికి వారే అవతలి వారిని గంజాయి బ్యాచ్‌గా చెబుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. దుగ్గిరాల పరిసర ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థం వినియోగం బాగా పెరిగిపోయిందని తెలియజేశారు. టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక కూకటి వేళ్లతో పెకళించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఇక్కడ మాత్రం పూర్తిగా అడ్డుకట్ట పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటలు దాటాక బజార్లు, నంబూరు దారిలో యువత మత్తులో తిరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయిన. దుగ్గిరాలలో కళాశాల మైదానం, చెన్నకేశవ నగర్‌లోని ప్రాథమిక పాఠశాల పరిసరాలు, ఎస్సీ, హిందూ శ్మశానవాటిక సమీపంలో, మార్కెట్‌యార్డు కొత్త స్థలంలో గంజాయి బ్యాచ్‌లు తిరుగుతున్నాయని వాపోతున్నారు.