ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకున్న జీఏడీ- ఐటీ విభాగంలో సోదాలు - AP Secretariat - AP SECRETARIAT

Inspections in ministers chambers: సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ స్వాధీనం చేసుకుంది. మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి బోర్డులను సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది తీసేశారు. మంత్రుల పేషీల్లోని ఫర్నిచర్, కంప్యూటర్ ల వివరాలను నమోదు చేసుకుని జీఏడీ అధికారులు వాటితో సరిపోల్చుకుంటున్నారు.

Inspections in ministers chambers
Inspections in ministers chambers (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 5:31 PM IST

Inspections in ministers chambers:ఏపీలో కూటమికి భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత మంత్రుల పేషీలు, కార్యాలయాల ఏర్పాట్లకు సంబంధించిన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా సచివాలయంలోని వివిధ కార్యాలయాల వివరాలు సేకరిస్తున్నారు. సచివాలయ సామగ్రి వివరాలు నమోదు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (GAD) మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం కోసం చర్యలకు ఉపక్రించింది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దంటూ జీఏడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే నేడు మంత్రుల కార్యాలయాల స్వాధీన ప్రక్రియను ప్రారంభించింది.

సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ స్వాధీనం చేసుకుంటుంది. మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి బోర్డులను సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది తీసేశారు. మంత్రుల పేషీల్లోని ఫర్నిచర్, కంప్యూటర్ల వివరాలను నమోదు చేసుకుని జీఏడీ అధికారులు వాటితో సరిపోల్చుకుంటున్నారు. వ్యక్తిగత సామగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు బిల్లులు చూపించాలని జీఏడీ సిబ్బంది స్పష్టం చేస్తుంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను స్వాధీనం చేసుకుంది. కార్యాలయం నుంచి బయటికి వెళ్లే వాహనాలను ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.


ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శలు - సీఐడీ ఏడీజీ సంజయ్ సెలవు రద్దు - Government Cancelled CID Chief Sanjay Leave

సచివాలయంలో పోలీసుల తనిఖీలు:సచివాలయంలోని ఐటీ విభాగంలో బుధవారం ఉదయం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్‌ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్‌లు, ల్యాప్‌ ట్యాప్‌లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్‌ నుంచి డేటా తస్కరణకు, డిలీట్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్‌డ్రైవ్‌లు, డేటా హార్డ్‌ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీలు చేశారని ఐటీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

సచివాలయం ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు - Police Chekings in the Secretariat

ABOUT THE AUTHOR

...view details