Frog in Chicken Biryani in Hyderabad IIIT Mess :బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. బిర్యానీ అంటేనే ఓ ఎమోషన్. బిర్యానీ ముఖ్యంగా ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కుండ బిర్యానీ, దమ్ బిర్యానీ అంటూ ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంచక్కా లాగించేస్తుంటారు. బిర్యానీ అంటే కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాదు అన్నట్లు బిర్యానీ రెసిపీలను తయారు చేస్తారు. అందులోనూ చికెన్ బిర్యానీ అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు యమ క్రేజ్‌గా యమ్మీ యమ్మీ అంటూ లాగించేస్తుంటారు.
సాధారణంగా చికెన్ బిర్యానీ వండాలంటే చికెన్‌తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలుతో పాటు కొత్తి మీర, పుదీనా, నెయ్యి వేసి చేస్తుంటారు. ఇవి అన్ని పెనంలో పడిన తర్వాత చికెన్ బిర్యానీకి వచ్చే టేస్టే అదరహో అనిపిస్తుంది. కానీ అవేమీ కాకుండా ఈ మధ్య జెర్రెలు, బల్లులు, బొద్దింకలతో కొందరు చికెన్ బిర్యానీ చేస్తున్నారు. ఇలాంటివి చాలా చోట్లనే జరుగుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ జెర్రీ వచ్చిందన్న వార్త సోషల్ మీడియాతో హల్చల్ సృష్టించింది. ఆ జెర్రీ విషయాన్ని మర్చిపోకముందే, బిర్యానీలో చనిపోయిన కప్ప అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.