Frauds In the Name Of Gold Loans :చాలా మంది అవసరం నిమిత్తం తమ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను తనఖా పెట్టి లోన్లు తీసుకుంటారు. ఏడాది తిరగక ముందే వడ్డీతో సహా చెల్లించి తమ వస్తువులను విడిపించుకుంటారు. ఇలానే ఓ వ్యక్తి తను తీసుకున్న లోన్‌కు వడ్డీ, అసలు చెల్లించి బంగారు ఆభరణాలను తీసుకోవడానికి బ్యాంక్‌కు వెళ్లగా, ఆ ఆభరణాల పేరిట రుణం తీసుకున్న డాక్యుమెంట్లు మరో వ్యక్తి పేరిట ఉండటంతో ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ గోల్‌మాల్ వ్యవహారం కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో చోటు చేసుకోగా ఇటీవల వెలుగులోకి వచ్చింది.
రుణాల పేరిట గోల్‌మాల్! :కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో 6 నెలల క్రితం పసిడి ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. సదరు మహిళకు లోన్ రూ.20 వేలు మంజూరు చేయగా, వడ్డీ, అసలు మొత్తం చెల్లించి తన ఆభరణాలు తీసుకుందామని ఆమె ఇటీవల బ్యాంకుకు వెళ్లింది. రుణం రూ.25 వేలు తీసుకున్నట్లుగా బ్యాంకు సిబ్బంది చూపించారు. అది కూడా మరో వ్యక్తి పేరుమీద మంజూరు కావడం గమనార్హం.