Fraud to Consumers with False Weights in all Malls And Markets :బహిరంగ మార్కెట్లో నిత్యావసరాలు కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు ఏదో ఒక రకంగా మోసపోతూనే ఉన్నారు. కేవలం చేపలు, కూరగాయల మార్కెట్లకే పరిమితం కాలేదు. ఎలక్ట్రానిక్ దుకాణాలు, కొన్ని షాపింగ్ మాల్స్‌లోనూ ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి నియంత్రణకు ప్రత్యేక యంత్రాంగం ఉన్నా అవి నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు.
- నగరవాసి అయిన రామస్వామి మార్కెట్‌కు వెళ్లి కిలో చేపలు కొన్నారు. అనుమానం వచ్చి మళ్లీ బయట తూకం వేయిస్తే 800 గ్రాములు మాత్రమే ఉందని తెలిసింది. షాప్ ఓనర్ దగ్గరకు వెళ్లిన అతనితో దుకాణ యజమాని వద్దకు వెళ్తే తన తూకం సరైనదే అని వాదించాడు. ఇక చేసేదేంలేక తిరుగుముఖం పట్టాడు.
- మరో వ్యక్తి గణేష్ మార్కెట్‌లో అయిదు కిలోల కూరగాయలు కొన్నాడు. మళ్లీ బయట తూకం వేయిస్తే అరకిలో (4.5 ) మాత్రమే ఉన్నాయి. తూకంలో తేడాను చూసి కొనుగోలుదారుడు అవాక్కయ్యాడు.
- సతీష్ అనే యువకుడు షాపింగ్ మాల్‌లో చొక్కా కొనడానికి వెళ్లాడు. దానిపై రూ.800 అని స్టిక్కర్ ఉంది. దాన్ని పరిశీలించి చూస్తే కింద మరో స్టిక్కర్ ఉన్నట్లు అర్థమయ్యింది. అది గమమనిస్తే తయారీదారుడు వేసిన స్టిక్కర్‌ను కనిపించకుండా దుకాణం వ్యాపారి మరో స్టిక్టర్ అంటించాడని అర్థమైంది.
- రోజువారి కూలీ అయిన ప్రసాద్ ఓ దుకాణానికి వెళ్లి కూల్‌డ్రింక్ కొనుక్కొని తాగాడు. సందేహం వచ్చి దానిపై ముద్రించి ఉన్న తేదీని చూశాడు. గడువు దాటిపోయినట్లు గుర్తించి నివ్వెరపోయాడు.ఇదేంటని వ్యాపారిని నిలదీస్తే చూసుకోలేదని సమాధానమిచ్చాడు.
ఓ దుకాణంలో తనిఖీ చేస్తున్న అధికారులు :గతంలో తూనికల కొలతల శాఖ అధికారులు ప్రతి ఆదివారం కూరగాయల, చేపల మార్కెట్, రైతు బజార్లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేసేవారు. తూకంలో మోసాలను ఎలా గుర్తించాలో వినియోగదారులకు అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం అలాంటి దాఖలాలే కనిపించడంలేదు. ఎప్పుడో ఒకప్పుడు తనిఖీలు చేసి సరిపెడుతున్నారు. పాతతరపు బాట్లను రెండేళ్లకు ఒకసారి మార్పించుకోవాల్సి ఉంటుంది. ఆ బాట్లను అధికారులు పరిశీలించి అరిగిన వాటిలో సీసం కరగబోసి సరైన తూకం ఉండేలా పోస్తారు. దానిపై తేదీ, బరువు వివరాలతో ముద్ర వేస్తారు. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు.
పండుగ వేళ పస్తులేనా? సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు