Police Special Treatment to Borugadda Anil Kumar :వైఎస్సార్సీపీ నేత, రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదల వ్యవహారంలో ఉన్నతాధికారులు మరో నలుగురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌ను కుర్చీ వేసి కూర్చోపెట్టడం, పడుకునేందుకు దిండు, దుప్పట్లు ఇచ్చి మర్యాదలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అరండల్ పేట్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావులను సస్పెన్షన్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు. స్టేషన్‌లో అనిల్ కు రాచమర్యాదలు చేసిన వీడియోలు బయటకు రావడంతో ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అరండల్ పేట సీఐను వీఆర్‌కు పంపించారు. ఇప్పుడు నలుగురు కానిస్టేబుళ్ల మీద వేటు వేస్తూ చర్యలు తీసుకున్నారు.
Police Special Treatment to Borugadda Anil Kumar :పోలీసు కస్టడీలో ఉన్న వైఎస్సార్సీపీ నేత, రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ కుమార్ తన చెల్లెలి కుమారుడితో పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సమక్షంలోనే ముచ్చటించిన మరో వీడియో బయటకు వచ్చింది. కస్టడీలో ఉన్న నిందితుడిని బయటి వ్యక్తి వచ్చి కలవడం పోలీసుల నిర్లక్ష్యమా, లేక అతనికి దాసోహమా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అక్టోబర్ 26 నుంచి 29 వరకు అనిల్‌కుమార్ గుంటూరులోని అరండల్‌పేట స్టేషన్‌లో కస్టడీలో ఉండగా, అతని మేనల్లుడు లోపలికి ప్రవేశించగానే అనిల్ చిరునవ్వు చిందిస్తూ 'ఏంట్రా అల్లుడు ఏం చేస్తున్నావంటూ' పలకరించి, తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. కొద్ది సేపు ఆ బాలుడి చెవిలో గుసగుసలాడడం వీడియోలో కనిపించింది.
రా రా కూర్చో-మనల్ని ఎవడ్రా ఆపేది - పోలీస్ స్టేషన్‌లో మేనల్లుడితో బోరుగడ్డ ముచ్చట్లు