Four Maoists Killed in Gadchiroli :మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 60 కమాండర్లతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన నలుగురూ తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టులుగా అధికారులు గుర్తించారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపారు.
గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు- నలుగురు మావోయిస్టులు హతం
Four Maoists Killed in Gadchiroli : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 9:49 AM IST
|Updated : Mar 19, 2024, 12:41 PM IST
నలుగురిపై గతంలో పోలీసుశాఖ భారీ రివార్డు ప్రకటించినట్లు వెల్లడించారు. నలుగురు మావోయిస్టులపై గతంలో రూ.36 లక్షల రివార్డు ప్రకటన చేసినట్లు తెలిపారు. చనిపోయిన మావోయిస్టులను వర్గీస్, మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌గా అధికారులు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, ప్లటూన్ మెంబర్లు రాజు, వెంకటేశ్ మృతి చెందినట్లు చెప్పారు. ఘటనస్థలం నుంచి ఏకే 47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల వేళ మావోయిస్టుల దాడులు- రాజకీయ పార్టీల్లో టెన్షన్ టెన్షన్!
ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి - వైసీపీ భూకబ్జాలపై మావోయిస్టుల లేఖ