4 Spot Dead in Car Accident at Jogulamba Gadwal :జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ నుంచి హైదరాబాద్వైపు వెళ్తున్న స్కార్పియో కారు ముందు వెళుతున్న లారీని వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన స్కార్పియో - ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం - 4 Died In Accident at gadwal - 4 DIED IN ACCIDENT AT GADWAL
4 AP Residents Died In Road Accident : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published : Jun 1, 2024, 7:03 AM IST
|Updated : Jun 1, 2024, 9:13 AM IST
ప్రమాద సమయంలో కారులో వెంకటేశ్ అతని భార్య పుష్ప, తల్లి లత, అతని పిల్లలు తరుణి, నందు, అక్క కవిత, మేనల్లుడు ఆదిత్య ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో వెంకటేశ్, పుష్ప, లత, ఆదిత్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అపస్మారక స్థితిలో ఉన్న కవిత, వెంకటేశ్ పిల్లలిద్దరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డకు చెందిన వారిగా భావిస్తున్నారు. వృత్తిరీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్న వెంకటేశ్ కుటుంబం, ఆళ్లగడ్డలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.