Former CM Jagan Inauguration of Central Testing Laboratory in Pulivendula : వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యానికి, ప్రజాధనం వృథాకి పులివెందులలో ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ల్యాబ్ ప్రారంభించిన మూణ్ణాళ్లకే మూలన పడటంతో కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. ప్రజా శ్రేయస్సు కన్నా ప్రైవేటు డెయిరీలపై కక్ష సాధింపునకు హడావుడిగా "స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ"ని అప్పటి సీఎం జగన్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ పరిశోధనా కేంద్రానికి రూ. 11 కోట్ల నిధుల్ని వెచ్చించిన జగన్ ప్రభుత్వం తిరుమలలో ల్యాబ్‌కు మాత్రం రూ. 75 లక్షలు ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కల్తీని గుర్తించేందుకు వీలుగా ల్యాబ్ : వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయి పశు పరిశోధన కేంద్రం ఏపీ కార్ల్. ఈ కేంద్రంలో 9-11-2023న సీఎం హోదాలో జగన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా పాలు, పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతున్నట్లు అప్పట్లో ఆరోపించిన వైఎస్సార్సీపీ ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎగుమతులకు పెంపొందించేందుకు వీలుగా పాలు, పాల ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్, పశువైద్య అవశేషాలు, మైకో టాక్సిన్లు, వ్యాధి కారకాలను గుర్తించవచ్చని తెలిపారు.
వంతెనల నిర్వాహణలో జగన్ జాప్యం-ప్రమాదం అంచున నిత్యం రాకపోకలు - PEOPLE SUFFER DUE TO DAMAGED BRIDGE
ప్రైవేటు డెయిరీలపై కక్ష సాధింపుగా :15 మంది నిపుణులను నియమిస్తున్నామంటూ వైఎస్సార్సీపీ పాలకులు ప్రగల్బాలు పలకగా ఇప్పటి వరకు తాళాలే తెరుచుకోలేదు. పాలు, పాల ఉత్పత్తుల పరిశోధనతో పాటు ఆహార ధాన్యాలు, తృణ ధాన్యాలు, పప్పుల నమూనాల విశ్లేషణ, ఫార్మా అప్లికేషన్ పరీక్షల నిర్వహణ అందుబాటులో సేవలందిస్తారని చెప్పినా ప్రయోజనం శూన్యం. రాష్ట్రంలో పాల డెయిరీలు టీడీపీ సానుభూతి పరులకు ఉన్నాయనే కక్ష్యతో ఈ ల్యాబ్ తీసుకొచ్చారన్న విమర్శలు ఉన్నాయి.