తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి చెరువు తూములో ఇరుక్కున్న వ్యక్తి - గంటల పాటు నరకయాతన!

ప్రమాదవశాత్తు చెరువు తూములో ఇరుక్కున్న మత్స్యకారుడు - జేసీబీల సహాయంతో వ్యక్తిని బయటకు తీసిన స్థానికులు

Fisherman stuck in a pond pipe
Fisherman stuck in a pond pipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2024, 5:54 PM IST

Fisherman Stuck In A Pond Pipe : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువు తూములో ఇరుక్కున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధిర మండలం సిరిపురం అనే గ్రామానికి చెందిన యంగల రాజు అనే మత్స్యకారుడు చేపల వేటకోసం వెళ్లాడు. ఇదే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువు తూములో పడి చిక్కుకున్నాడు. అది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై జేసీబీల సహాయంతో రాజును బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు గొట్టంలో ఇరుక్కున్న మత్స్యకారుడిని సురక్షితంగా బయటకు తీశారు. అతడిని బయటకు తీయడం కొంచెం ఆలస్యమైనా ఊపిరి అందక ఓ నిండు ప్రాణం బలయ్యేదని స్థానికులు చెబుతున్నారు. వారంతా మానవతా హృదయంతో సత్వరం స్పందించడంతో యంగల రాజు సురక్షితంగా ప్రాణాలతో బయటకు వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details