Finance Assistance to Flood Victims in AP: రాష్ట్రంలో ఆగస్టు - సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలు, వరద బాధితులకు అందించే సాయంపై ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. విజయవాడ పరిధిలో లక్షన్నర మంది బాధితులకు వరద సాయం కింద ఆర్థిక ప్యాకేజీ అందించనుంది. బాధితులకు ఆర్థిక సాయం కింద దాదాపు రూ. 597 కోట్లను ప్రభుత్వం పంపిణి చేయనుంది.
రేపే వరద సాయం - 4 లక్షల మందికి రూ.597 కోట్లు అందజేత - Finance Assistance to Flood Victims
Finance Assistance to Flood Victims in AP: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వరద నష్టం అంచనాలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి, విజయవాడలో లక్షన్నర మంది బాధితులకు వరద సాయం అందించనుంది. దాదాపు రూ.597 కోట్లను ప్రభుత్వం బాధితులకు అందజేయనుంది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2024, 8:30 PM IST
ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు ప్రభుత్వం మించి ఆర్థిక సాయం అందిస్తోంది. ముంపు ప్రాంతాల్లో రూ. 180 కోట్ల మేర బ్యాంక్ రుణాల రీ-షెడ్యూల్ చేయనుంది. ఎన్యూమరేషన్లో ఎవరికీ ప్యాకేజీ అందక పోయినా నిబంధనల మేరకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక ప్యాకేజీ అందించనున్నారు.