ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎగిసిపడుతున్న రాకాసి అలలు - కోత బారిన తీరప్రాంత గ్రామాలు

ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపిన ఫెయింజల్‌ తుపాన్‌ - తీర ప్రాంతాల గ్రామాల్లో పర్యటించిన టీడీపీ నేత వర్మ

Cyclone Fainjal Impact on Uppada Coast
Cyclone Fainjal Impact on Uppada Coast (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 4:40 PM IST

Fengal Cyclone Impact on Uppada Coast :ఫెయింజల్‌ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరపు ప్రాంత మత్స్యకారులు, గ్రామస్థులు నిత్యం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ తమ ఇళ్లు, భూములు సముద్రంలో కలిసి పోతాయోనని బెంబేలెత్తిపోతున్నారు.

నెల రోజులు వ్యవధిలో రెండు తుపాన్లు :ఫెయింజల్‌ తుపాన్ ప్రభావం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై తీవ్రంగా చూపింది. గత రెండు రోజులుగా సముద్రంలోని పెను మార్పులు ఏర్పడి రాకాసి అలలు తీవ్ర ప్రభావం చూపాయి. కెరటాల తాకిడికి తీర ప్రాంత గ్రామాలు కోత బారిన పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, గృహాలు, చెట్లు నేలకొరిగి సముద్రంలో కలిసిపోయాయి. బాధితులు నిలవడానికి నీడ లేక రోడ్డున పడ్డారు. ప్రధానంగా ఉప్పాడ, మాయాపట్నం సూరాడపేట, కోనపాపపేట గ్రామాలు కోత బారిన పడ్డాయి. నెల రోజుల వ్యవధిలో రెండు తుపాన్ల ప్రభావం తీర ప్రాంత గ్రామాలపై పడటంతో మత్స్యకార కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాయి.

తిరుమలలో భారీ వర్షం - శ్రీవారి భక్తులకు ఆ మార్గాల్లో నో ఎంట్రీ

రక్షణ గోడ నిర్మాణం ప్రారంభిస్తాం :టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వర్మ తీర ప్రాంత గ్రామాల్లో, కోతకు గురైన మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. కోత ప్రభావాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడ్డారు. గృహాలు కోల్పోయిన వారికి సురక్షిత ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టిందని తెలిపారు. త్వరలోనే రక్షణ గోడ నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు.

"గృహాలు కోల్పోయిన వారికి సురక్షిత ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. అలాగే త్వరలోనే రక్షణ గోడ నిర్మాణం ప్రారంభిస్తాం" -వర్మ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Chandrababu on Fengal Cyclone :మరోవైపు ఫెయింజల్‌​ తుపాన్​పై విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం పేర్కొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఫెయింజల్‌ తుపాన్ ఎఫెక్ట్ - పలుచోట్ల కురుస్తున్న వర్షాలు

ABOUT THE AUTHOR

...view details