Female Police Officer Take Bribe in NTR Pensions Distribution : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ సొమ్మును రెండింతలు పెంచింది. వృద్ధులకు, వితంతువులు, ఇతరత్రాలకు రూ.4 వేలు, విభిన్న ప్రతిభావంతులకు రూ.6 వేలు. మంచానికి పరిమితమైన వారితో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి రూ.15వేలు ఇస్తున్నారు. ఇదే అదునుగా తీసుకొని పింఛన్ పంపిణీ చేసే సమయంలో కొందరు ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారు.
నరసరావుపేట చంద్రబాబు పింఛన్ల పంపిణీ : రాష్ట్రంలోని సామాజిక పింఛనర్ల ఇళ్లలో, ఒకరోజు ముందే నూతన సంవత్సర శోభ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం జనవరి 1కి, బదులు డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ చేశారు. 2021లో కరోనాతో భర్తను కోల్పోయిన తలారి శారమ్మకు వితంతు పింఛన్, ఏడు కొండలకు వృద్ధాప్య పింఛన్ స్వయంగా అందించారు.
కొత్త పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం - ప్రతి నెల రూ.4వేలు
పింఛన్, రేషన్ కార్డు పోతుందని బెదిరింపులు : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సామాజిక పింఛన్ల పంపిణీలో చేతివాటం ప్రదర్శించిన మహిళా పోలీసును అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్‌తో పాటు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జమ్మలమడుగు నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం 19, 20 వార్డు సచివాలయం మహిళా పోలీస్ భారతి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆమె పరిధిలో 46 పింఛన్లు ఉండగా ఒక్కొక్కరి నుంచి 300 రూపాయలు, 600 రూపాయలు వసూలు చేశారు. వృద్ధాప్య పింఛన్లకు 300 రూపాయలు, వికలాంగుల నుంచి 600 రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు.
తనకు లంచం ఇవ్వకపోతే వచ్చే నెలలో పెన్షన్ రాకుండా చేస్తానని బెదిరించడంతో తప్పని పరిస్థితిలో కొంతమంది ఇచ్చారు. మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమెపై చర్యలకు దిగింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పందిస్తూ ఆమెను సస్పెండ్ చేయాలని జమ్మలమడుగు నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా పోలీసును సస్పెండ్ చేసినట్లు నగర పంచాయతీ కమిషనర్ వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు.
వారికి రెండు నెలల పింఛన్: సెర్ఫ్ సీఈవో
వారికి పింఛన్ కట్! - కొత్త దరఖాస్తులు ఎప్పుడో తెలుసా?