ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా కూతురికి అన్యాయం జరిగింది - పోలీసులు పట్టించుకోలేదు - అందుకే చంపేశా!

కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించిన సమీప బంధువు - కువైట్‌ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లిపోయిన తండ్రి

Father Kills Man Who Misbehaved with Daughter
Father Kills Man Who Misbehaved with Daughter (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Father Kills Man Who Misbehaved with Daughter :తమకు అన్యాయం జరిగిదంటూ ఎవరైనా ఆశ్రయించినప్పుడు పోలీసులు సకాలంలో సరిగా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో, ఒక్కోసారి ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తారో తెలియజేసే సంఘటన ఇది. తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగా స్పందించకపోవడంతో ఒక వ్యక్తి ఏకంగా ఇతర దేశమైన కువైట్‌ నుంచి వచ్చి అతడిని హత్య చేశాడు. ఎవ్వరికి తెలియకుండా తిరిగి కువైట్‌ వెళ్లిపోయాడు. అనంతరం అతడు బుధవారం వీడియో విడుదల చేశాడు. దీంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే,

మనవరాలితో అసభ్య ప్రవర్తన : అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో గత శనివారం తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు (59) హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతడు తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్‌ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనంగా మారింది. ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. ఇటీవల చెల్లెలి మామ మనవరాలి వరస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

కోరిక తీర్చలేదని మహిళ కుమారుడి హత్య - నిందితుడు వరుసకు మేనమామ

పట్టించుకోని పోలీసులు : ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్‌ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్‌ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో తల్లి కువైట్‌ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు దివ్యాంగుడిని పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటి అని తనలో తాను ఆవేదన చెందాడు. కువైట్‌ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడి తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. వెంటనే కువైట్‌ వెళ్లిపోయాడు. ఈ విషయంపై వివరణ ఇస్తూ బుధవారం సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. చట్ట ప్రకారం న్యాయం జరగకనే హత్య చేశానని వెల్లడించారు.

'నాన్నా.. నాన్నా' అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు - ఇద్దరు కుమార్తెలను కాల్వలోకి తోసిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details