బాగోగులు చూడలేక కుమారుడిని కొట్టి చంపిన తండ్రి Father Killed Four Years Son At Proddutur: తల్లిని కోల్పోయిన కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడు అయ్యాడు. నాలుగేళ్ల కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచాల్సింది పోయి కర్కశత్వాన్ని చూపాడు. ముద్దులొలికే పసి పిల్లాడిని నిత్యం హింసకు గురిచేశాడు. కాళ్లూ, చేతులు విరిగిగేలా దాడి చేసి నరకం చూపించాడు. చివరకు అభం శుభం తెలియని ఆ బాలున్ని కొట్టి చంపేశాడు. నిండునూరేళ్లు బతకాల్సిన బుడతడిని పసిప్రాయంలోనే ప్రాణాలు తీసిన ఆ కాసాయి తండ్రి ఆపై ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. ఒంటిపై గాయాలు ఉండటాన్ని గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ తండ్రి రాక్షసత్వం బయటపడింది. ఈ హృదయ విధారక ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది.
కూతురు పాలిట యమపాశమైన తండ్రి
ప్రొద్దుటూరుకు చెందిన షేక్ ఇమ్రాన్‌కు, వీరపునాయుని పల్లె మండలం ఉరుటూరుకు చెందిన షాబిరున్లకు 2016లో వివాహం అయ్యింది. వీరికి ఆరేళ్ల కుమార్తె రుబీనా, నాలుగేళ్ల కుమారుడు ముస్తఖీం సంతానం. ముస్తఖీం జన్మించిన నాలుగు రోజులకే తల్లి షాబిరున్ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో పిల్లలు ఇద్దరూ తండ్రి వద్దే ఉంటున్నారు. ఇమ్రాన్ ఎలక్ట్రిషియన్ పనులు జీవనం సాగిస్తున్నాడు. చాలా రోజుల నుంచి కుమారుడు ముస్తఖీంను ఇమ్రాన్ కొట్టి హింసించేవాడు. గతేడాది మే నెలలో మరో మహిళను ఇమ్రాన్ రెండో వివాహం చేసుకున్నాడు.
నల్లగా ఉందని ఊపిరాడకుండా చేసి 18 నెలల పసిబిడ్డ హత్య! - father killed daughter
అల్లరి చేస్తున్నాడని నిత్యం చిత్రహింసలకు గురి: అల్లరి చేస్తున్నాడని బాలుడిని నిత్యం కొడుతూ నరకం చూపించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. బాలుడిని కొడుతున్న విషయం తెలుసుకున్న మొదటి భార్య షాబిరున్ కుటుంబ సభ్యులు పిల్లల్ని తమ వద్దకు పంపిస్తే వారి బాగోగులు చూస్తామని పదిరోజులు క్రితం ఇమ్రాన్‌ను కోరారు. అందుకు ఇమ్రాన్ నిరాకరించటంతో బాలున్ని ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పి వచ్చేశారు. సోమవారం ముస్తఖీం చనిపోయాడని కుటుంబసభ్యులకు సమాచారం రావడంతో హుటాహుటిన ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. అప్పటికే ముస్తఖీంను ఖననం చేసేందుకు ఇమ్రాన్ ఏర్పాట్లు చేశాడు. బాలుడి ఒంటిపై గాయాలు గమనించిన షాబిరున్ కుటుంబ సభ్యులు ముస్తఖీంకు ఏమైందని ప్రశ్నించగా తానే కొట్టి చంపేశాననిఇమ్రాన్ బదులిచ్చాడు.
ఉద్యోగం కోసం దారుణం.. మూడు నెలల చిన్నారిని నదిలో పడేసిన తల్లిదండ్రులు
వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీకాంత్, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్షల కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలున్ని విపరీతంగా కొట్టడంతోనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ముస్తఖీంకు ఆరోగ్యం సరిగ్గా లేదని, అతని బాగోగులు చూడలేక చంపేశాడని బాలుడి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.