Father Killed Person Who Misbehaved with His Daughter : తమకు అన్యాయం జరిగిదంటూ ఎవరైనా ఆశ్రయించినప్పుడు పోలీసులు సకాలంలో సరిగ్గా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో, ఒక్కోసారి ఓర్చుకోలేక ఎలా ప్రవర్తిస్తారో తెలియజేసే ఉదంతం ఇది. తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందిచకపోవడంతో ఆవేదనకు గురైన తండ్రి కువైట్ నుంచి వచ్చి అతడిని హతమార్చాడు. తిరిగి కువైట్ వెళ్లిపోయిన అతడు బుధవారం వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన ఓ కుటుంబం కువైట్లో ఉంటున్నారు. దీంతో వారి కుమార్తెను ఊళ్లో ఉంటున్న చెల్లెలు ఇంటి దగ్గర ఉంచారు. ఇటీవల ఓ వ్యక్తి మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లికి ఫోన్లో చేసి చెప్పగా, ఆమె వెంటనే చెల్లెకి ఫోన్ చేసి అడగ్గా సరిగ్గా స్పందించలేదు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తండ్రి కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అద్దెకు దిగుతామంటూ సొమ్ముపై కన్నేసి - ఆపై వృద్ధ దంపతులను హత్యచేసి!