ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు' - కలెక్టరేట్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - Farmer Suicide Attempt

Farmer Suicide Attempt in Front of Collectorate in Satya Sai District : కలెక్టరేట్​ ముందు ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమి ఆక్రమించుకుని పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు సమస్యపై డీఆర్​వో వచ్చి ఆరా తీశారు. అతనికి న్యాయం చేయాలని ఆర్​డీవోను ఆదేశించారు.

FARMER SUICIDE ATTEMPT
'పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు'- కలెక్టరేట్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 3:04 PM IST

Farmer Suicide Attempt in Front of Collectorate in Satya Sai District : తన భూమి ఆక్రమించి పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఓ రైతు ఒంటిపై పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సత్యసాయి జిల్లాలో చోటు చోసుకుంది. పుట్టవర్తి కలెక్టరేట్​లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో తన బాధను చెప్పుకోవడానికి పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీ దండువారి పల్లి గ్రామానికి చెందిన ముంటిమడుగు దస్తగిరి అనే రైతు కలెక్టరేట్​ కార్యాలయానికి వచ్చాడు. ఈ క్రమంలోనే తన భార్యకు అర్జీ ఇచ్చి పంపించి కలెక్టరేట్​ బయట పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీస్​ సిబ్బంది గమనించి అతడిని అడ్డుకున్నారు.

'మేమేం చేశాం అమ్మా' - ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి - Mother Commits Suicide

గత ప్రభుత్వ హయాంలో తన స్థలాన్ని బాబు అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని దస్తగిరి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం తన పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఈ పని చేశానని తెలియజేశాడు. ఇప్పటి వరకు పొలంపై 5 లక్షల రూపాయలు ఖర్చు చేశానని తెలిపారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు. బాధితుడి వద్దకు డీఆర్​వో కొండయ్య వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు ఏం జరిగిందో వివరాలు తెలుసుకుని దస్తగిరి సమస్యను పరిష్కరించాలని ఆర్డోవో భాగ్యరేఖను ఆదేశించారు. న్యాయం చేస్తామని బాధితుడికి అధికారులు హామీ ఇచ్చారు.

అప్పు చెల్లించాలని ఫైనాన్స్​ సంస్థ వేధింపులు - దంపతుల ఆత్మహత్య - FINANCE COMPANY HARASSMENT

ఎన్‌ఐటీ పట్నాలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్‌ నోట్‌ లభ్యం - AP Student Suicide in NIT Patna

ABOUT THE AUTHOR

...view details