Excise Officer Arrest 3 Members for Selling Liquor Illegally Outside in West Godavari District : రాష్ట్రంలో మద్యం విధానం మారగానే వ్యాపారులు చెలరేగిపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు సైతం మద్యం అమ్మకాలతో దండుకుంటున్నారు. తణుకు సంత మార్కెట్ ఏరియాలో బహిరంగ మద్యం విక్రయం సంచలనమైంది. మార్కెట్లను రెండు చోట్ల ముగ్గురు వ్యక్తులు కలిసి మద్యం అమ్మడం ప్రారంభించారు. మద్యం అమ్ముతున్న విషయం పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు తెలియడంతో దాడులు చేశారు ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 8 వేల రూపాయలు విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
దాడుల సమయంలో పరారైన మద్యం విక్రయదారులను ఫొటోల సహకారంతో పట్టుకుని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి మాట్లాడుతూ సంత మార్కెట్లో మద్యం అమ్ముతున్న షేక్ మున్నా, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్య అనే ముగ్గురిని అరెస్ట్ అరెస్టు చేసి వారి నుంచి 60మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రెండు కేసులు నమోదు చేశామన్నారు. బెల్టు దుకాణాలకు అనుమతి లేదని, అలా బహిరంగంగా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.