తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవ్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా - ముగ్గురి అరెస్ట్ - Police Arrested Drugs Supply Gang - POLICE ARRESTED DRUGS SUPPLY GANG

Drugs Supply Gang In Hyderabad : హైదరాబాద్​లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువ చేసే మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో గంజాయి తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 62 లక్షల రూపాయల విలువైన 247 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

Police Arrested Drugs Supply Gang
Police Arrested Drugs Supply Gang (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 10:48 AM IST

Police Arrested Drugs Supply Gang In Hyderabad : నగరంలో ప్రవేటు హస్టల్లో ఉంటు డ్రగ్స్‌ సరాఫరా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుట్టు రట్టు చేశారు. వారి వద్ద నుంచి 12 లక్షల విలువైన డ్రగ్స్‌తో పాటు 250 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకోన్నారు. హైదరాబాద్​లో పలువురికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముగ్గురు కీలక వ్యక్తులను అధికారులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఎస్‌ఆర్‌ నగర్‌లోని వెంకట్‌ అనే బాయ్స్‌ హస్టల్‌లో దాడులు నిర్వహించి ముగ్గరు నిందితులను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. ఈ డ్రగ్స్‌ను బెంగూళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లోని విద్యార్థులకు డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో గుర్తించారు.

బెంగూళూరుకు చెందిన మోహిత్‌ లోకేష్‌ రావు, పుసులేటి యజ్ఞదత్తు, చిత్తూరు నుంచి బెంగూళూరులో ఉంటున్న కె.ఎం రవూప డ్రగ్స్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో గత కొంత కాలంగా విక్రయాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. వీరు నగరంలో రేవ్​పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు నిందితుల్లో కెఎం ‌రవూపకు నైజీరియాకు చెందిన నెగ్గెన్‌ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. తాజాగా మాదాపూర్‌లో రేవ్‌ పార్టీలో పట్టుబడిన నిందితులకు డ్రగ్స్‌ సరపరా చేసిన వారి వివరాలు సేకరించే క్రమంలో వీరిని గుర్తించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు.

డ్రగ్స్ సరఫరాపై టీజీన్యాబ్‌ ఉక్కుపాదం - అమ్మినా, కొన్నా కఠిన చర్యలు - TGNAB Focus On Drugs In Hyderabad

మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో గంజాయి తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని సీలేరు వైపు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌ తరలిస్తుండగా సారపాకలో తనిఖీలు చేపట్టిన పోలీసులు, మూడు కార్లు అనుమానాస్పదంగా కనిపించడంతో, ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి గుర్తించారు. మూడు కార్లలో ఉన్న 62 లక్షల రూపాయల విలువైన 247 కిలోల నిషేధిత గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

మరో ఘటనలో వరంగల్‌ జిల్లా నెక్కొండలోని రైల్వే స్టేషన్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పుష్కర్ హరిదాస్ నెక్కొండ రైల్వే స్టేషన్లో అనుమానస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి, లక్షా 37 వేల రూపాయల విలువ చేసే గంజాయి పట్టుకున్నారు. అతన్ని విచారించగా ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు.

మాదాపూర్​లో రేవ్​ పార్టీ భగ్నం - భారీగా డ్రగ్స్ స్వాధీనం! - rave party breaks out in madhapur

ABOUT THE AUTHOR

...view details