EX MLA Shakeel Son Rahil Extra Case : బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహిల్‌పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదవడంతో షకీల్ స్పందించారు. అతని సందేశాన్ని దుబాయ్ నుంచి వీడియో రూపంలో తెలియజేశారు. తన కుమారుడిపై కక్ష పూరితంగా కేసులు వేస్తున్నారని ఆరోపించారు. రాహిల్ తప్పు ఉంటే చట్టం పరంగా ఉరి తీసిన తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అంతేకాని ఓ విద్యార్థిని నేరస్థుల మధ్యలో పెట్టి మానసిక క్షోభకు గురి చేయవద్దని వేడుకున్నారు. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చొరవచూపి సిటింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని కోరారు.
Jubilee Hills Road Accident Case : రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడ్ని నిందుతుడిగా చేయడంపై మాజీ ఎమ్మెల్యే షకిల్(EX MLA Sakheel) ఖండించాడు. తన బాధను వీడియో రూపంలో ప్రజలకు తెలియజేశారు. డీసీపీ విజయ్ కుమార్ రాజకీయ కక్షతోనో, మరే విధంగానో తమను హింసిస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి తానే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాహిల్ దుబాయ్‌లో చదువుకుంటున్నాడని పారిపోయి రాలేదని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టి మానసికంగా కుంగదీస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తన కుమారుడ్ని ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
"నేను రెండు చేతులు జోడించి రేవంత్ రెడ్డిని కోరుతున్నాను. మా కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఏదైనా తప్పు ఉంటే శిక్షించండి. కేసులు పెట్టి బాధపెట్టకండి. ఈ విషయంలో సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయాలని కోరుతున్నాను."-షకీల్, మాజీ ఎమ్మెల్యే