ETV Karthika Deepotsavam in Ongole:ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో ఒంగోలులో కార్తిక దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. రిమ్స్ ఆస్పత్రి పక్కనున్న మినీ స్టేడియంలో నిర్వహించిన దీపోత్సవాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలకు నిర్వహకులు పూజాసామాగ్రి ఉచితంగా అందజేశారు.
కురుక్షేత్రం తర్వాత, ద్వాపరయుగం అంతం కలియుగం ఎలా ప్రారంభమైంది, శ్రీకృష్ణుడు ఆటవిక వ్యక్తి చేతిలో చనిపోవడం నిజమా, తదితర పురాణ అంతర్గత రహస్యాలపై రాజగోపాల చక్రవర్తి ప్రవచనం చెప్పారు. అనంతరం మహిళలు సాముహిక దీపారాధన చేశారు. కోటి దీపాల కాంతులతో, శివనామస్మరణతో మినీ స్టేడియం పులకించింది. 2 గంటల ఆధ్యాత్మిక కార్యక్రమంలో మహిళలు తన్మయత్వంతో బోళా శంకరుడ్ని ప్రార్థించి శ్రీమహాలక్ష్మిని పూజించారు.
వేద పండితులు మందాది మధుమురళీకృష్ణ వందిలి బానుప్రకాష్ శర్మ బృందం వేద పఠనం చేసి ఆ ప్రాంగణాన్ని భక్తి సాదవైక్యంలోకి తీసుకెళ్లారు. వైదిక కార్యనిర్వాహకులు పులుపుం పణికుమార్ శర్మ బృందం విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాన్ని ఆరంభించింది. పరమేశ్వరుని అంశతో జన్మించి శత్రు భయంకురుడు, అంజనీ సుతుడు ఆంజనేయ అష్టోత్తరాన్ని పటింకించారు. మధుక్షేత్ర యుద్ధంలో బతికి బట్టకట్టిన వారుఎవరు, ఆ తర్వాత పాండువులు ఎంతకాలం పాలించారు, శ్రీకృష్ణుడు ఎలా తనువు రాలించాడు, శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక ఎందుకు సముద్రంలో మునిపోయింది, దానికి ముందు ఏం జరిగింది, అర్జునుడు అడవి దొంగల చేతిలో ఎందుకు ఓడిపోయాడు తదితర పురాణ రహస్యాలను వేదపండితులు వివరించారు.