ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పీఎఫ్​ ఖాతాదారులకు వడ్డీ పెంపు - ఎంత శాతమంటే ? - EPF Interest Payment

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 12:27 PM IST

EPF Interest Payment: పీఎఫ్​ అకౌంట్ హోల్డర్స్​కు ఈపీఎఫ్​వో శుభవార్త చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యధిక వడ్డీ అని పేర్కొంటూ సామాజిక మాధ్యమం ఎక్స్​లో ట్వీట్ చేసింది.

EPF_Interest_Payment
EPF_Interest_Payment (ETV Bharat)

Increase in EPF interest Rates: ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలకంగా పని చేస్తోంది. తమ వేతనంలో కొంత మొత్తాన్ని ఈపీఎఫ్​వో అకౌంట్లో జమ చేస్తే పని చేస్తున్న సంస్థ యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. ఇలా పోగైన డబ్బును ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ రూపంలో అందిస్తారు.

ఈ నేపథ్యంలో పీఎఫ్​ అకౌంట్ హోల్టర్లకు ఈపీఎఫ్​వో తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. గత సంవత్సరం వడ్డీరేటు. 8.15 శాతం ఉండగా దాన్ని ప్రస్తుతం 8.25 కి పెంచుతున్నట్లు తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ చెల్లింపుల గురించి మెంబర్ల నుంచి తరచూ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది.

పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్​​ - కేవలం 3 రోజుల్లోనే డబ్బులు! - EPF Advance Claim Limit Extend

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ నిల్వలపై 8.25 శాతం వడ్డీ ఖరారు చేస్తూ మే 31న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లు ఈపీఎఫ్‌వో సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. 2023-24 మధ్యలో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలో ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారిందరికీ సవరించిన వడ్డీనే చెల్లిస్తున్నట్లు తెలిపింది. అంటే పదవీ విరమణ చేసి వెళ్తున్న మెంబర్లకు పెరిగిన వడ్డీ రేట్ల ప్రకారమే సెటిల్మెంట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత సవరించిన వడ్డీ ప్రయోజనం అందాలన్న ఉద్దేశంతో ఫైనల్‌ సెటిల్‌మెంట్లు చేసుకుంటున్న చందాదారులందరికీ అదే వడ్డీని చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఖాతాదారులకు అదే వడ్డీ త్వరలో అందుతుందని తెలిపింది. అయితే ఎప్పడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. త్రైమాసిక పద్ధతిన వడ్డీ రేట్లు వెల్లడించడం కుదరదని, ఆర్థిక ఏడాది ముగిసిన తర్వాత తొలి త్రైమాసికంలో మాత్రమే వార్షిక వడ్డీ రేట్ల సవరణ ఉంటుందని తెలిపింది.

EPF​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​​ - ఇకపై డెత్​ క్లెయిమ్ చాలా ఈజీ - ఎలా అంటే? - EPF Death Claim Process

ABOUT THE AUTHOR

...view details