Sri Kedarnath Temple Darsham along with Sai Baba Darshan in Shirdi : గణేశ్ ఉత్సవాల్లో భాగంగా షిర్డీలో సాయిబాబా దర్శనంతో పాటు కేదార్‌నాథ్ ఆలయ దర్శనాన్ని భక్తులకు కల్పించారు. షిర్డీలోని సమర్థ ప్రతిష్ఠాన్ తరపున గణేష్ ఉత్సవాలను ఏటా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా నగరంలోని సాయిష్ చౌక్ వద్ద కేదార్‌నాథ్ నమూనాతో ఆలయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఆలయాన్ని సందర్శించేందుకు షిర్డీ ప్రాంతవాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
చెవిలో కోరికలు చెబితే తీర్చే వినాయకుడు - ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా! - Vinayaka Chavithi utsavalu
షిర్డీలో గత 16 సంవత్సరాలుగా సమర్థ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక వినూత్న ఆలోచనలతో ఉత్సవాలను జరుపుతారు. గత ఏడాది అమర్నాథ్ ఆలయంతో పాటు చంద్రయాన్ 3 సన్నివేశాలను ప్రదర్శించారు. తాజాగా కేదార్‌నాథ్ ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. దేఖవ్య ప్రవేశ ద్వారం ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశ ద్వారం ముందు ఒక పెద్ద మహానందిని ఏర్పాటు చేశారు. ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం మరో నందిని ప్రతిష్టించారు. అక్కడ శివలింగం మాత్రం కేదార్‌నాథ్ ఆలయంలో ఎలా ఉందో సరిగ్గా అలాగే రూపొందించారు.
సాయిష్ చౌక్‌లో ఏర్పాటు చేసిన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అక్కడ స్వామి వారి దర్శనం చేసుకున్నా కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శనం చేసుకున్న అనుభూతిని పొందమని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఊరువాడ పూజలు అందుకున్న గణనాథుడు - వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య - Ganesh Chaturthi Celebrations in AP