Electricity AE Caught-red-handed-to-acb :ప్రజల నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందించాల్సిన అధికారి డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పటం జగనన్న ప్రభుత్వంలో కామన్ అయిపోయింది. ప్రజలు పని జరగటం కోసం మరో మార్గం లేక అధికారులు డిమాండ్ చేసినంత లంచం ఇచ్చి కొందరు పని చేయించుకుంటున్నారు. మరికొందరు అధికారులు డిమాండ్ చేసినంత చెల్లించుకోలేక నిరాశతో వెనుతిరుగుతున్నారు. తాజాగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఒక అధికారి లంచం (Bribing) తీసుకుంటూ ఏసీబీ అధికారుల (ACB Officers)కు గురువారం పట్టుబట్టాడు. అధికారులు నిందితుని వద్ద నుంచి ఇరవై వేల రూపాయిలు స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ వలలో సబ్ ఇంజినీర్ - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
Anantapur Electricity Department Officer Demanded Bribe: ఏసీబీ అధికారి వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంలో రెండు సంవత్సరాల క్రితం బోరు వేయించారు. విద్యుత్ సప్లై కోసం వజ్రకరూరు విద్యుత్ శాఖలో ట్రాన్స్ఫార్మర్ కోసం ఏడాది క్రితం అప్లై చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు మెటీరియల్ మంజూరు అయినప్పటికీ విద్యుత్ శాఖ ఏఈ (Assistant Engineer) చంద్రశేఖర్ రైతు ఆనంద్‌ను రూ. 30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రైతు నేను అంత ఇచ్చుకోలేనని రూ.20 వేల రూపాయలు ఇచ్చే విధంగా భేరసారాలు కుదుర్చుకున్నారు.