ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ అరాచకాలకు వత్తాసు - మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు - Election Commission Transfers - ELECTION COMMISSION TRANSFERS

Election Commission Transfers SI And CI: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ముకాసిన పోలీసులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మాచర్ల టౌన్ సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వి.శ్రీహరిలను బదిలీ చేసింది. ఠాణాల్లో ఎస్సైలు, సీఐల ప్రోత్సాహంతోనే మాచర్లలో వైఎస్సార్సీపీ అల్లరిమూక చెలరేగిపోతోందని తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలస్యంగానైనా ఈసీ స్పందించి వారిపై వేటు వేసింది.

Election Commission Transfers SI And CI
Election Commission Transfers SI And CI (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 7:10 AM IST

వైఎస్సార్సీపీ అరాచకాలకు వత్తాసు! - మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు (ETV Bharat)

Election Commission Transfers SI And CI :రాష్ట్రంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా ఎన్నికల సంఘం విధినిర్వహణలో ఆలసత్వం చూపుతున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటుంది. ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డిని బదిలీ చేసిన ఈసీ మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, సదుం ఎస్సై మారుతిపై బదిలీవేటు వేసింది. 24 గంటలు గడవక ముందే పల్నాడు జిల్లాలో అధికార వైఎస్సార్సీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్న ముగ్గురు పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంది. మాచర్ల సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా శ్రీహరిని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

పిన్నెల్లి సోదరులకు సలాం :మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకానికి ఈ ముగ్గురు పోలీసులు అధికారులు సలాం కొడుతున్నారనే విమర్శలు ఎప్పటీ నుంచో వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈసీ వారిపై వేటు వేసింది. మాచర్ల టౌన్‌ సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరిలపై బదిలీ వేటు వేయడమే కాకుండా వెంటనే కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని మార్చి కొత్త ఎస్పీని వేసినా జిల్లాకు చెందిన ఈ పోలీసులు తమ తీరును మార్చుకోలేదు. వైసీపీకు అంటకాగుతూనే ఉండడంతో వరుస దాడులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఠాణాల్లో ఎస్సైలు, సీఐల వల్లే మాచర్లలో వైసీపీ అల్లరి మూక చెలరేగిపోతోందని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణల్లో నిజముందని తేలడంతో కాస్త ఆలస్యంగానైనా వేటు వేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

'వైఎస్సార్సీపీ వీరభక్తుడు' డీఐజీ అమ్మిరెడ్డిపై - ఎలక్షన్ కమిషన్ కొరడా - EC Transfers DIG Ammireddy

'పోతారా పోరా కాల్చిపడేస్తా' : దుర్భాషలాడుతూ 'మీసం మెలేయడం' కారంపూడి సీఐ చిన్నమల్లయ్య ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండేవారు. మార్చి 26న కారంపూడిలో ఓ టీస్టాల్‌ వద్ద టీడీపీ శ్రేణులు టీ తాగుతుండగా చేతిలో పిస్తోలు పట్టుకుని 'పోతారా పోరా' అంటూ రెచ్చిపోయారు. 'కాల్చిపడేస్తా' అంటూ ప్రతాపం చూపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్నప్పుడు వినుకొండ రూరల్, వినుకొండ టౌన్, మాచర్ల రూరల్‌ పోలీసు స్టేషన్లలో పనిచేశారు. 2015లో మాచర్ల రూరల్‌ సీఐగా ఉన్నప్పుడు ఆవులు, గేదెలు రోడ్లపైకి ఎక్కువగా వస్తుండడంతో వాటి యజమానులతో కౌన్సెలింగ్‌ సమావేశం ఏర్పాటు చేశారు. పశువుల్ని ఇలా ఇష్టమొచ్చినట్టు రోడ్లపైకి వదిలేస్తున్నారు. ఇదే మీ పెళ్లాల్ని కూడా ఇలానే రోడ్లపైకి వదిలేస్తారా? అని వారితో అనడం పెద్ద దుమారం రేపింది.

2015లోనే రెండు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపై జలవివాదం నడుస్తోంది. యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, దీంతో గొడవకు కారణమయ్యారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. 2021లో మునిసిపల్‌ ఎన్నికల జరుగుతున్న సమయంలో వినుకొండ టౌన్‌ సీఐగా ఉన్నారు. అప్పుడు 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని బీఎస్పీకి చెందిన రాజు, సీపీఐ నాయకులు చిన్న పోదాల శీనులు సీఐకు ఫిర్యాదు చేస్తే ఆయన వీరిపైనే ఎదురుదాడికి దిగడంతో ఇరువురి మధ్య పెద్ద వివాదం రేగింది. డీఎస్పీ ఎదుటే బాధితులు సీఐతో సామాన్యులను దుర్భాషలాడుతావా? అంటూ ప్రశ్నించారు. డీఎస్పీ ఉన్నా సరే సీఐను బీఎస్పీ రాజు వందసార్లు తంతాం అంటూ దాడికి పాల్పడేయత్న చేయడం గమనార్హం.

వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు - EC TRANSFERS INTELLIGENCE DG AND CP

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి :మాచర్ల పట్టణంలో టీడీపీ వారిపై వరుసదాడులు చోటుచేసుకుంటున్నా చర్యలు తీసుకోవడంలో మాచర్ల టౌన్‌ సీఐ శరత్‌ బాబు విఫలమయ్యారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన మరుసటి రోజే మాచర్ల పట్టణంలో టీడీపీ కార్యకర్త ఇర్ల సురేష్‌ కారును వైసీపీ మూకలు తగులబెట్టాయి. నిందితులెవరో తెలిసినా చర్యలు తీసుకోలేదు. ఈసీ అక్షింతలు వేశాక ప్రధాన నిందితుడిని తప్పించి మిగతావారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైసీపీకు చెందిన బొలెరోనూ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. ఇటీవల 13వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అయితే ముందుగానే టీడీపీ వాళ్లు పోలీసులకు సమాచారం అందించినా సకాలంలో రాకపోవడంతో దాడులు జరిగాయి. మాచర్ల పట్టణంలో టీడీపీ వర్గీయులపై వరుస దాడులు జరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించేవారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

టీడీపీ సానుభూతిపరులపై లెక్కలేనన్ని కేసులు :వెల్దుర్తి ఎస్సై శ్రీహరి మొదట నుంచీ పిన్నెల్లి సోదరులతో సత్సంబంధాలు నడిపారు. వారి అండదండలు చూసి సామాన్యులను హింసించారు. పార్టీ మారతావా లేదా? అంటూ సంబంధం లేని కేసులో ఇరికించి టీడీపీ సానుభూతిపరుడైన మత్స్యకారుడు దుర్గారావును ఆత్మహత్య చేసుకునేలా హింసించారు. చివరకు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా ఎస్సైపై చర్యలు తీసుకోలేదు. టీడీపీ సానుభూతిపరులపై లెక్కలేనన్ని కేసులు పెట్టి ఠాణాకు పిలిపించి వేధించేవారని ఆరోపణలున్నాయి. వసూళ్లలో ఆరితేరిపోయాడు. అందుకోసం ప్రైవేటుగా వ్యక్తులను నియమించుకున్నారు. అక్రమ కేసులు బనాయించి టీడీపీ కార్యకర్తలను పార్టీ మారాలని ఒత్తిడికి పాల్పడేవారు. ఎమ్మెల్యే పిన్నెల్లి చెప్పినట్లు నడుచుకుంటూ కొత్త ఎస్పీ వచ్చినా తీరు మార్చుకోలేదు. ఎట్టకేలకు పోలింగ్​కు ముందు ఈసీ స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం కొరడా - ప్రతిపక్షాల అణచివేత, నిబంధనల పాతరకు ఫలితం! - IAS And IPS Officers Transfers

ABOUT THE AUTHOR

...view details