Election Commission Releases Revised Voters List in Telangana :తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం విడుదల చేసింది. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితాను సీఈవో సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. జాబితా ప్రకారం, తెలంగాణలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళలు, 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
ఓటర్ల జాబితా సవరణ - తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే - VOTERS LIST RELEASE IN TELANGANA
సవరించిన ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం - రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925
Election Commission Releases Revised Voters List in Telangana (ETV Bharat)
Published : Jan 6, 2025, 4:47 PM IST
|Updated : Jan 6, 2025, 4:57 PM IST
వీరిలో 5,45,026 మంది 18-19 సంవత్సరాల ఓటర్లు, 2,22,091 మంది 85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు, 3,591 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. 5,26,993 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అతి తక్కువగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.
సవరించిన ఓటర్ల జాబితా వివరాలు | |
మొత్తం ఓటర్లు | 3,35,27,925 |
పురుష ఓటర్లు | 1,66,41,489 |
మహిళా ఓటర్లు | 1,68,67,735 |
థర్డ్ జెండర్ ఓటర్లు | 2,829 |
18-19 సంవత్సరాల ఓటర్లు | 5,45,026 |
85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు | 2,22,091 |
ఎన్ఆర్ఐ ఓటర్లు | 3,591 |
దివ్యాంగ ఓటర్లు | 5,26,993 |
తెెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు స్టార్ట్ - ఎప్పుడైనా జరిగే ఛాన్స్!
Last Updated : Jan 6, 2025, 4:57 PM IST