EC Orders on Pension Distribution: పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మార్చి 30 తేదీన జారీ చేసినట్టు ఈసి వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పెన్షన్‌ను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చనీ, ఈ విషయాన్ని గత ఆదేశాల్లో స్పష్టం చేశామని వెల్లడించింది. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.
వాస్తవిక దృష్టితో ఆలోచించాలి - పింఛన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు - EC Orders on pension distribution - EC ORDERS ON PENSION DISTRIBUTION
EC Orders on Pension Distribution: పింఛన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలంటూ మార్చి 30న మార్గదర్శకాలు జారీచేసినట్లు ఈసీ వెల్లడించింది. మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్‌కు తేల్చిచెప్పింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 9:32 AM IST
|Updated : Apr 27, 2024, 9:53 AM IST
పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్టుగా తమ దృష్టికి వచ్చిందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయొచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పామని వెల్లడించింది. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మరోమారు సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సూచించింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని సూచించింది. గతంలో పెన్షన్ ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.