Election Commission Did not Action On SIs :రాష్ట్రంలోని హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల సహకారం లేకుండా ఉన్నతాధికారులు ఏం చేయగలరు? తాజాగా సస్పెండైన పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ ఇద్దరూ నియమితులై నెల రోజులవుతోంది.
ఐతే హింసకు పాల్పడి ఎన్నికల్లో పైచేయి సాధించాలనే కుట్రతో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కోడ్ రావడానికి కొన్ని నెలల ముందే వైఎస్సార్సీపీ వీరభక్తులైన అధికారులను డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించుకుంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పూర్వ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి వీరిని నియమించారు. అలాంటప్పుడు వాళ్లు ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల మాటే వింటారు. అందుకే తెలుగుదేశం కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. హింసాకాండకు క్షేత్రస్థాయి అధికారులనూ బాధ్యుల్ని చేసిన ఎన్నికల సంఘం వారిని సస్పెన్షన్‌తోనే సరిపెట్టింది.
రాష్ట్రంలో హింసాకాండను నియంత్రణలో పోలీసు బాస్‌లు విఫలం - ఈసీ వేటుకు బలి - EC Suspend SPs in AP
Election Violence in Andhra Pradesh :పల్నాడు జిల్లాలో కొందరు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు ప్రతిపక్షాలపై దాడులకు ఉసిగొల్పారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపుల్లో ఉంటూ భద్రతా బలగాల కదలికలు సహా ఇతర కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులకు, ఆస్తుల విధ్వంసానికి సహకరించారు. మరికొందరైతే కళ్లముందే ఘర్షణలు జరుగుతున్నా కట్టడి చేయకుండా సహకరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున పోలీసు శాఖలో కోవర్టులుగా పని చేశారు.