Election Code Violations in AP : ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం ఖాకీ చొక్కా వేసుకుని కారంపూడి సీఐ చిన్న మల్లయ్య టీడీపీ శ్రేణులపై రంకెలేశారు! కాల్చిపడేస్తా, రౌడీషీట్ తెరిచి లాకప్‌లో వేస్తా అంటూ తెలుగుదేశం శ్రేణుల్ని ఆయన బెదిరిస్తే ఇంతవరకూ ఎలాంటి చర్యల్లేవ్! కనీసం సంజాయిషీ అడగలేదంటే ఏపీలో అమల్లో ఉంది ఎన్నికల కోడా? వైసీపీ కోడా?
Police Officials Working for YSRCP :కర్నూలులో తెలుగుదేశం నాయకుడు శేషగిరిశెట్టిని స్పెషల్ పార్టీ సీఐ ఆదినారాయణరెడ్డి, ఇద్దరు కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్ పేరిట పిలిచి చితకబాదారు. హింసను అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతుంటే ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది? ఇలాగైతే నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యమేనా? పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఇలా తగలబెట్టారు. చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులే నిప్పుపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు లేవు.
అరాచక 'గ్రంథం' - గోదావరి జిల్లాల్లో పేట్రేగిపోతున్న వైసీపీ నేత - YSRCP Leader Irregularities
AP Elections 2024 :కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు మాధవీరెడ్డి, ఆమె కుమార్తెపై అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడితే పోలీసులు వారికే వత్తాసు పలికారు. ఇక గుడివాడలో వైఎస్సార్సీపీ అండదండలతో పేట్రేగిపోతున్న గంజాయి బ్యాచ్ ఓ ఇంటర్మీడియట్ అమ్మాయిని వేధించింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకుండా నిందితులకే సహకరించారు. వేధింపులు మరింత పెరగటంతో బాధితురాలి తండ్రి దిశ యాప్‌లో కంప్లైంట్ చేశారు. ఫలితంగా అతనిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టేందుకు ఇన్స్పెక్టర్లు యత్నించారు.
వైసీపీ అరాచకాలకు అంతేలేదు :మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడేనికి చెందిన టీడీపీ నాయకులు (YSRCP Leaders Attack on TDP)తులసీనాయక్, రవినాయక్, శీను నాయక్‌లపై వైసీపీ శ్రేణులు కర్రలు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. పల్నాడులో వైసీపీ అరాచకాలకు అంతేలేదు. పోలీసులు కూడా ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీని బదిలీ చేసిన ప్రభుత్వం, మరికొందరు వైఎస్సార్సీపీ బంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రివర్స్‌లో టీడీపీ వారిపైనే కేసు : ఇక గుంటూరు జిల్లా పోలీసులూ ఎన్నికల కోడ్ అమల్లో ఒకవైపే చూస్తున్నారు. కొల్లూరు మండలం కిష్కిందపాలెంలో పంచాయతీ సిబ్బంది టీడీపీ కార్యకర్తల ఇళ్లపై జెండాలు తొలగించారు. వైసీపీ శ్రేణుల ఇళ్లపై ఆ పార్టీ జెండాల్ని మాత్రం తీయలేదు. ఇదేంటని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులపై వైఎస్సార్సీపీ వారు దాడి చేశారు. పోలీసులు కూడా రివర్స్‌లో టీడీపీ వారిపైనే కేసు పెట్టారు.
బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు