తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ - అదిరిపోయే లైటింగ్​తో యూనిట్‌ ఆఫీసులు జిగేల్ జిగేల్ - Eenadu Golden Jubilee Celebrations

Eenadu 50 Years Celebrations : ఈనాడు దినపత్రిక స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల సంబరాలు అంబరాన్నంటాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో యూనిట్ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. ఈనాడు స్వర్ణోత్సవ సమయంలో ప్రధానకార్యాలయాలు స్వర్ణకాంతులను విరజిమ్మాయి.

Eenadu Golden Jubilee Celebrations
Eenadu Office Ready for Golden Jubilee Celebration (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 7:02 AM IST

Updated : Aug 10, 2024, 7:09 AM IST

Eenadu Office Ready for Golden Jubilee Celebration :అక్షరయోధుడు రామోజీరావు ఆలోచనల నుంచి 1974 ఆగస్టు 10న విశాఖ వేదికగా పుట్టిన ఈనాడు పత్రిక. అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలు చూరగొని అగ్రస్థానానికి చేరుకుంది. నాటి నుంచి నేటివరకు విశేష వార్తలు, కథనాలను అందిస్తూ పాఠకుల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈనాడు దినపత్రిక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనిట్ కార్యాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతులతో కొత్త రూపు సంతరించుకున్నాయి.

ఈనాడు దినపత్రిక స్వర్ణోత్సవ వేళ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలోని ప్రధాన కార్యాలయం విద్యుత్‌ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మింది. ఖైరతాబాద్, ఉప్పల్‌లోని ఈనాడు కార్యాలయాలకు రంగు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కచ్చితత్వం, ప్రజాప్రయోజనం, విశ్వసనీయత, వృత్తి నిబంధన, సత్యనిష్ఠ ఈ ఐదు సూత్రాలను గతి తప్పకుండా పాటించడం వల్లే ఈనాడు ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని సగర్వంగా పూర్తి చేయగలిగింది.

దేదీప్యమానంగా విరిసిన జిల్లాలోని యూనిట్‌ కార్యాలయాలు : ఈనాడు పత్రికను ప్రజలకు మరింత చేరువ చేయడంలో యూనిట్‌ కార్యాలయాలు కీలక భూమిక పోషించాయి. తెలుగులో వెలుగులు విరజిమ్మిన ఈనాడు దినపత్రిక 50 వసంతాల వేళ కరీంనగర్‌, నిజామాబాద్‌, హనుమకొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయాలన్ని విద్యుత్ దీపాలతో ధగధగా మెరిసిపోయాయి. ప్రత్యేక అలంకరణ చూపరులని కన్నార్పకుండా చేసింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల కళాశాలల విద్యార్థులు స్వచ్చందంగా మెుక్కలు నాటారు. నల్గొండ జిల్లాలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈనాడు, ఈటీవీ వల్లే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​కు చెందిన పత్ర కళాకారుడు శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రావి ఆకుపై ఈనాడు గ్రూప్‌ అధినేత రామోజీ రావు, ఈటీవీ, 50వ ఈనాడు స్వర్ణోత్సవ రూపాలు చిత్రీకరించాడు.

Eenadu Golden Jubilee Celebrations : స్వర్ణోత్సవాల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖ, తిరుపతిలోని ఈనాడు కార్యాలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్‌ దీపకాంతుల వెలుగుల్లో ఈనాడు కార్యాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

"ఈనాడు" అక్షర సమరానికి నేటితో 50 ఏళ్లు! - స్పెషల్ ఫొటో గ్యాలరీ మీకోసం - Eenadu 50 Years Celebrations

Eenadu@50 : అభాగ్యుల పెన్నిధి - దేశమంతటా మానవత్వ పరిమళాలు వెదజల్లిన 'ఈనాడు' - Eenadu Golden Jubilee Celebrations

Last Updated : Aug 10, 2024, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details