ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి నిర్మాణ పనులు - టెండర్లకు ఈసీ అనుమతి - EC PERMISSION TO AMARAVATI WORKS

రాజధాని అమరావతిలో పనులకు అభ్యంతరం లేదంటూ ఈసీ లేఖ - ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఫైనలైజ్‌ చేయాలన్న ఈసీ

EC_Permission_to_Amaravati_Works
EC_Permission_to_Amaravati_Works (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2025, 5:18 PM IST

EC Gives Permission to Call tenders for Amaravati Works:రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతిచ్చింది. కృష్ణ - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఈసీ రాజధానిలో పనులకు అభ్యంతరం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని లేఖలో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details