ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కింగ్ ​కోబ్రాకు కష్టమొచ్చింది'- ఆడ కోబ్రా వెళ్లిపోవడంతో గుడ్ల సంరక్షణ - KING COBRA EGGS - KING COBRA EGGS

Eastern Ghats Wildlife Society Protected King Cobra Eggs : పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే కింగ్​కోబ్రా ఇప్పుడు అంతరించిపోతున్న జాబితాలో చేరింది. ఈ అరుదైన నాగజాతిని పరిరక్షించేందుకు ఈస్ట్రన్​ ఘాట్స్​ వైల్డ్​ లైఫ్​ సొసైటీ ముందుకొచ్చింది. అటవీ శాఖ అనుమతితో శాస్త్రీయ పద్ధతిలో వీటి గుడ్లను సంరక్షిస్తోంది.

king_kobra_alluri_district
king_kobra_alluri_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 9:37 AM IST

Updated : Jul 28, 2024, 10:00 AM IST

Eastern Ghats Wildlife Society Protected King Cobra Eggs :ప్రపంచంలోనే అరుదైన, అతిపెద్ద విషపూరిత ప్రాణుల్లో కింగ్‌కోబ్రా ఒకటి. దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడవు ఉండే ఈ గిరినాగులను చూస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది. చాలా అరుదుగా మాత్రమే ఇవి మనుషులను కాటేస్తాయి. మన రాష్ట్రంలో మన్యంలో తరుచూ కనిపించే ఈ గిరినాగులు అంతరించేపోయే జంతుజాతుల జాబితాలో చేరాయి. అందుకే ఈ నాగజాతిని రక్షించుకునేందుకు తూర్పు కనుముల వన్యప్రాణి సొసైటీ నడుం బిగించింది. వాటి గుడ్లను పరిరక్షిస్తోంది. పిల్లలుగా మారిన తర్వాత వాటిని అడవుల్లో వదిలిపెడుతున్నారు.

మానవాళికి శాపంగా భూతాపం- మన కర్తవ్యమేంటి? ఏం చేయాలి? - World Environment Day 2024

క్రమంగా తగ్గుతున్న కింగ్​కోబ్రాల సంఖ్య :దట్టమైన అటవీసంపదకు పెట్టింది పేరు తూర్పుకనుమలు. ఎతైన కొండలు, లోయలు జీవ వైవిధ్యానికి నెలవు. ఎన్నో అరుదైన జంతుజాలము, పక్షులు, సరీసృపాలకు ఇక్కడ కొదవ లేదు. అరుదైన సర్పజాతులు ఇక్కడ కనిపిస్తాయి. అయితే వాటిల్లో కొన్ని అంతరించిపోతున్న జాబితాలో చేరాయి. వాటిల్లో అతి ముఖ్యమైనంది కింగ్‌కోబ్రా. దాదాపు పది అడుగుల పైనే ఉండే ఈ విషసర్పాన్ని స్థానికంగా గిరినాగు అంటారు. అడవుల్లో నుంచి ఇళ్లల్లోకి చేరుతున్న వీటిని గిరిజనులు కొట్టి చంపడం, రోడ్లపైకి వచ్చి వాహనాల కిందపడి చనిపోవడం వల్ల కొన్నాళ్లుగా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. అరుదైన ఈ నాగజాతిని కాపాడుకునేందుకు ఈస్ట్రన్ ఘాట్స్‌ వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ ముందుకొచ్చింది. వీటి గుడ్లను సంరక్షించడం ద్వారా ఈ జాతిని కాపాడాలని నడుం బిగించింది. అటవీశాఖ అనుమతితో శాస్త్రీయ పద్ధతిలో గుడ్లను సంరక్షిస్తోంది.

ఏ'మడ'గలేరనే ధీమా! జగనన్న కాలనీల ముసుగులో మడ అడవుల విధ్వంసం - YSRCP Destroyed Mangroves

సంరక్షిస్తోన్న వైల్డ్​లైఫ్​ సొసైటీ : అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలోని కింగ్‌కోబ్రా ఉన్నట్లు గిరిజనుల ద్వారా సమాచారం సేకరించిన సొసైటీ ప్రతినిధులు స్వయంగా వెళ్లి పరిశీలించారు. సమీపంలోని అటవీ ప్రాంతంలోనే ఇది గుడ్లను పొదుగుతోందని గమనించారు. ఆడ కోబ్రా బయటకు వెళ్లిపోయిన తర్వాత పొదిగిన పిల్లలు గూడు నుంచి బయటకు రాకుండా చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేశారు. అటవీ జంతువుల నుంచి వాటిని రక్షించారు. కింగ్‌కోబ్రా పిల్లలు కొంత పెద్దవిగా అయిన తర్వాత వాటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కొత్తగా 30 గిరినాగులు అటవీప్రాంతంలోకి వచ్చినట్లు వైల్డ్‌లైఫ్‌ సొసైటీ సభ్యులు తెలిపారు.

సైకిలెక్కిన చైతన్యం- పర్యావరణహితమే లక్ష్యంగా వేల కిలోమీటర్ల ప్రయాణం - Cycle Yatra to Save Environment

Last Updated : Jul 28, 2024, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details