కడపలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు- కోలాహలంగా తరలివస్తున్న భక్తులు Dwadasa Jyotirlinga Darshanam at Kadapa:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడపలోని బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రధాన శైవక్షేత్రాలలోని శివలింగాల ఆకృతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. శివలింగాలను చూసేందుకు భక్తులు కోలాహలంగా తరలివస్తున్నారు. భక్తులు వాటిని సందర్శించి పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్న శివలింగాలను చూడలేని వారు ఇక్కడికి వచ్చి శివలింగాలను చూసి తన్మయత్నం పొందుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు.
జ్యోతిర్లింగ దర్శనంలో భాగంగా సోమనాథ్ ఆలయం, శ్రీశైలం, ఓం కాళేశ్వరుడు, వైద్యనాథుడు, భీమేశ్వరుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు కేదార్నాథ్, మహా కాళేశ్వరుడు ప్రాంతాలలో ఉన్న శివలింగాల ఆకృతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుని సత్యభామ ప్రతిమలను అక్కడ ఏర్పాటు చేశారు. హోలోగ్రామ్ శివలింగంతో పాటు వివిధ రకాల శివలింగాలను ఏర్పాటు చేశారు. భక్తులు వాటిని విశేషంగా సందర్శిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్న శివలింగాలను చూడలేని వారందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన శివలింగాలను చూసి తన్మయత్నం పొందుతున్నారు. ఏళ్ల తరబడి నిద్రపోతున్న కుంబకర్ణుడిని నిద్రలేపటం వంటి ప్రదర్శన ఏర్పాట్లు చేసి ఆ ప్రాంగణమంతా భక్తి వాతావరణాన్ని కల్పించారు.
సింహాచలంలో ఘనంగా శివపార్వతుల వసంతోత్సవాలు
Start Mahasivaratri Celebrations: రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పరిశీలించారు. 1200 మంది పోలీసులతో భద్రత కల్పించడంతో పాటు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. నంద్యాల జిల్లా మహానందిలో ఉత్సవమూర్తులు పల్లకిలో నంద్యాలకు చేరుకున్నారు. బ్రహ్మానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులతో కలిసి మహానందికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యలలోని పలు వీధుల్లో గ్రామోత్సవం చేపట్టి తిరిగి మహానందికి బయల్దేరారు.
వైభవోపేతంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షణ
మల్లికార్జునుడు కొలువైన శ్రీశైలం మహాక్షేత్రంలో ఇప్పటికే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈ వేడుకలను ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల వైభవాన్ని తిలకించేందుకు నల్లమల అడవుల గుండా భక్తులు పాదయాత్రగా తరలివస్తున్నారు. శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 11 తేదీ వరకు జరగబోతున్నాయి. నేడు రావణ వాహనం, పుష్పపల్లకి సేవ, 7న గజ వాహన సేవ, 8న నంది వాహన సేవ, 9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.
కోలాటాలు, థింసా నృత్యాలు- ఘనంగా ప్రారంభమైన సత్యసాయి అమృత సేవా దేవాలయం