ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా- మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్​ వివరాలు - DSC NOTIFICATION POSTPONED

అనివార్య కారణాలతో వాయిదా- పరీక్ష పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

andhra_pradesh_dsc_notification_announcement_postponed
andhra_pradesh_dsc_notification_announcement_postponed (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 10:00 AM IST

Mega DSC Notification Announcement Postponed :రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉండగా పలు అనివార్య కారణాలతో అధికారులు దీనిని వాయిదా వేశారు. మరో నాలుగైదు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Minister Nara Lokesh Directs Officials to Ensure Tansparent Mega DSC :విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మెగా డీఎస్సీ పరీక్ష పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిన్న (మంగళవారం) నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. డీఎస్సీలో సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ నెల 11న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

వందకు వంద శాతం మార్కులు.. ఎలా చదివావమ్మ?

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చే చర్యల్లో భాగంగా తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. డిసెంబరు మొదటి వారంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని వివరించారు. రాష్ట్రం మొత్తాన్ని నాలుగు జోన్లుగా విభజించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు మండలానికో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ప్రశ్నాపత్రాలను ఏఐ ద్వారా మూల్యాంకనం చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివి జేఈఈ, నీట్‌ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫొటోలు దినపత్రికల్లో ప్రచురించేలా చర్యలు చేపట్టి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని లోకేశ్‌ ఆదేశించారు.

వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ (NCERT) పుస్తకాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రశ్నపత్రంలో మార్పులు చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్‌ విజయరామరాజు, ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్‌ కృతికా శుక్లా, సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నిరుద్యోగులారా సిద్ధమా - వచ్చే నెలలో భారీ నోటిఫికేషన్

ABOUT THE AUTHOR

...view details