ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్‌ది రాజకీయ 'సిద్ధం' - తమది డీఎస్సీ యుద్ధమంటున్న నిరుద్యోగులు

DSC Candidates Protest in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రమంతా డీఎస్సీ అభ్యర్థుల నిరసనలతో హోరెత్తింది. రానున్న ఎన్నికల్లో జగన్​కు బుద్ది చెప్తామని ధ్వజమెత్తారు. ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న వారి ఆశలకు అధిష్ఠానం తిలోదకాలు వదిలిందని మండిపడుతున్నారు. జగన్‌ది రాజకీయ సిద్ధం అయితే తమది డీఎస్సీ యుద్దమంటూ కన్నెర్రజేశారు.

Etv Bharatdsc_candidates_protest_in_andhra_pradesh
Etv Bharatdsc_candidates_protest_in_andhra_pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 5:10 PM IST

Updated : Feb 5, 2024, 8:02 PM IST

జగన్‌ది రాజకీయ 'సిద్ధం' - తమది డీఎస్సీ యుద్ధమంటున్న నిరుద్యోగులు

DSC Candidates Protest in Andhra Pradesh : జగన్‌ సర్కార్‌ నిరుద్యోగులను నిలువునా ముంచిందంటూ డీఎస్సీ అభ్యర్థులు కదం తొక్కారు. దగా డీఎస్సీ మాకొద్దు - మెగా డీఎస్సీ కావాలంటూ గళమెత్తారు. పలు జిల్లాల్లో సున్నా పోస్టులతో డీఎస్సీ ఇచ్చేందుకు సిద్ధమైన జగన్‌కు రానున్న ఎన్నికల్లో అదే సంఖ్య ఇచ్చి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జగన్‌ది రాజకీయ సిద్ధం అయితే తమది డీఎస్సీ యుద్ధమంటూ హోరెత్తించారు. పాదయాత్ర చేసినప్పుడు 23వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి ఎన్నికలకు ముందు ఆరు వేల పోస్టుల భర్తీకే ఆమోదం తెలపడంపై కన్నెర్రజేశారు.

దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ప్లీజ్​- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు

DSC Protest in Vizianagaram :మెగా డీఎస్సీ డిమాండ్‌తో విజయనగరం కోట జంక్షన్‌లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. డీఎస్సీ అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ మానవహారం చేశారు. 'మెగా డీఎస్సీ ముద్దు - జగనన్న వద్దు' అంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరికి తెలుగు యువత, నిరుద్యోగ జేఏసీ నేతలు మద్దతు తెలిపారు. డీఎస్సీ అభ్యర్థుల నిరసనతో భారీగా పోలీసులు మోహరించారు. ఏళ్ల తరబడి కోచింగ్ కేంద్రాలలో అర్ధాకలితో మెగా డీఎస్సీ కోసం ఎదురు చూశామని నిరుద్యోగుల గోడు వెళ్లబోసుకున్నారు.

Mega DSC Protest In Guntur District :ఎన్నికల వేళలో యువతను మళ్లీ మోసం చేసేందుకే మినీ డీఎస్సీ ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటూ నిరుద్యోగులు మండిపడ్డారు. అవనిగడ్డలో డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు వివరించేందుకు వచ్చిన అభ్యర్థులను నాగబాబు కలిశారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో మెగా డీఎస్సీ చేర్చాలని నాగబాబుకు విన్నవించారు.

అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన - జగన్​కు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక

DSC Candidates Rally in Prakasam District :ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ డీఎస్సీ అభ్యర్థులు భారీ నిరసన ర్యాలీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిరుద్యోగుల ర్యాలీని అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేశారు. పోలీసులకు, డీఎస్సీ అభ్యర్థులకు మధ్య వాగ్వావాదం జరిగింది. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ నిరుద్యోగుల డిమాండ్‌ చేశారు.

DSC Candidates Protest at Anantapur Collectorate :అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై ఎండలో కుర్చీలో కూర్చొని చదువుతూ నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఏటా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్​ మాట తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఇస్తామంటే బటన్ నొక్కి గెలిపించామని అదే బటన్ నొక్కి ఈసారి ఇంటికి పంపుతామని హెచ్చరించారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను జగన్‌ ప్రభుత్వం వమ్ము చేసిందని మండిపడ్డారు.

మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!

Last Updated : Feb 5, 2024, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details