DSC Protest In Hyderabad : డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలా వెంకటేశ్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. డీఎడ్, బీఎడ్, నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా డీఎస్సీ కోసం సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డీఏఓ, టెట్ పరీక్షలను రాయడం జరిగిందని, వెంటనే డీఎస్సీ పరీక్ష ఉంటే దానికి సన్నద్ధం అవ్వడానికి సరైన సమయం లేదని వివరించారు.
అంతేగాక డీఎస్సీలో కొత్త సిలబస్ మార్పులు చేశారని దాన్ని పూర్తిగా చదవడానికి సమయం పడుతుందని అన్నారు. ఈ కొంత సమయంలో పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేకపోతున్నట్లు వాపోయారు. కాగా పరీక్షల పూర్తి సన్నద్ధం కోసం మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు. ప్రభుత్వం స్పందించి పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
గ్రూప్స్ పరీక్షల్లో మార్పులు చేయాలంటూ రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు - అరెస్ట్ చేసిన పోలీసులు - Students Strike in Telangana
ఇటీవల రాసిన టెట్, రాయబోయే డీఎస్సీకి విభిన్నమైన సిలబస్ ఉండడం కారణంగా పూర్తి చేయలేక మానసిక క్షోభకు గురవుతున్నట్లు వాపోయారు. మళ్లీ మధ్యలో వివిధ పోటీ పరీక్షలు ఉన్న కారణంగా సమయం లేక నష్టపోతున్నామని చెప్పారు. ఇప్పటికైనా అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకుని కొంత సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
"మేము ఇటీవలే పరీక్ష క్వాలిఫై అయ్యాం. నెల రోజుల సమయం కూడా సరిగ్గా లేదు మమ్మల్ని పరీక్ష రాయమంటే చాలా సిలబస్ ఉంది ఎలా చదవగలుగుతాం. టెట్ పరీక్షది, డీఎస్సీది వేరే సిలబస్ ఇదంతా పూర్తి చేయడానికి మారు మూడు నెలల సమయం కావాలి. మెగా డీఎస్సీ అన్నారు అది వేయలేదు. ఇప్పుడు తక్కువ సమయంలో పరీక్ష అంటున్నారు. చదివే వాళ్లకి తెలుస్తుంది మా బాధ. పరీక్షను వాయిదా వేసే వరకి మేము మా ధర్నాను విరమించం. ఇంత ధర్నా చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అసలు స్పందించడమే లేదు. ప్రభుత్వ పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలి." - డీఎస్సీ అభ్యర్థులు
పరీక్షలు అయ్యేవరకు విద్యా వాలంటీర్లను నియమించండి : విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డీఎస్సీ వాయిదా వేయాలని విద్యా కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నియామకాలు పూర్తి అయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు. ముట్టడికి యత్నించిన అభ్యర్థులను అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం - కాచిగూడలో ఉద్రిక్తత - Students Union Leaders Protest\
విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ఏబీవీపీ ఆందోళన - పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ - ABVP Leaders Protest