DSC Candidates Agitations Against CM Jagan :ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేసేందుకు 6,100 పోస్టులకు రాష్ట్రమంత్రివర్గం తీర్మానం చేయడంపై డీఎస్సీ అభ్యర్థులు భగ్గుమన్నారు. ప్రతిపక్షనేత జగన్ ఊరూవాడా తిరుగుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి తీరా ఐదేళ్ల తర్వాత 6వేల పోస్టులు భర్తీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP DSC Notification 2024 :కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు వందలాదిగా రోడ్డెక్కారు. బస్టాండ్ సెంటరులో ఆందోళన, మానవహారం చేపట్టారు. మెగా డీఎస్సీ విడుదల చేయకుండా సీఎం జగన్ మోసం చేశారని, డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో ఊరు వాడ తిరిగి 25 వేల పోస్టులు ఉన్నాయని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మేగా డీఎస్సీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను దగా చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మేగా డీఎస్సీ ఇవ్వకపోతే వైఎస్సార్సీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Unemployed Youth in AP :నిరుద్యోగులు జగన్ పాలనలో మోసపోయారని అన్నారు. ప్రభుత్వం తక్షణం నిర్ణయం మార్చుకుని నెలరోజుల్లో 25వేల పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. ఒక్క డీఎస్సీ అభ్యర్థులే 7 లక్షల మంది ఉన్నారని మొత్తం నిరుద్యోగులు 20 లక్షలకు పైగానే ఉంటారని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!