DRO Played Online Rummy During Meeting at Collectorate:ఆయనో బాధ్యాతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి. ఈ క్రమంలో ఆయనో ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి ఉన్నతాధికారులైన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతరులు హాజరయ్యారు. ఇదే సమావేశానికి రెవెన్యూ అధికారి కూడా హాజరయ్యారు. కానీ ఆయన ఆ సమావేశంలో చేసిన పనికి మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ఆ పని ఏంటి అనుకుంటున్నారా. కలెక్టరేట్ కార్యాలయంలో ఒకపక్క సమావేశం జరుగుతుండగా మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడుతూ జిల్లా రెవెన్యూ అధికారి బిజీబిజీగా గడిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం సోమవారం (20-01-2025) జరిగింది. అయితే ఈ సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగాను, అనుకూలంగా జనం తరలివచ్చారు.