ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 3:40 PM IST

Updated : Apr 25, 2024, 4:38 PM IST

ETV Bharat / state

తాగునీటి కోసం అల్లాడుతున్న తిరువూరు ప్రజలు - Drinking water problems

Drinking water problems in Tiruvuru: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నీటి సౌకర్యం కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. పాతకాలం నాటి తాగునీటి పథకాల ద్వారా నీరు అందిస్తున్నా వాటి సామర్థ్యం చాలడం లేదు. కొన్ని వార్డులకు రెండ్రోజులకు ఒకసారి, మరికొన్ని వార్డులకు మూడ్రోజులకు ఒకసారి చొప్పున తాగునీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Drinking water problems in Tiruvuru
Drinking water problems in Tiruvuru

తాగునీటి కోసం అల్లాడుతున్న తిరువూరు ప్రజలు

Drinking water problems in Tiruvuru: నడివేసవిలో పట్టణాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. రోజూ ఇవ్వాల్సిన తాగునీరును రెండు, మూడు రోజులకొకసారి ఇస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పురపాలక సంఘంలో పరిస్థితే ఇందుకు ఉదాహరణ. పాతకాలం నాటి తాగునీటి పథకాల సామర్థ్యం చాలడం లేదు. కొత్త పథకం ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలు ఆగిపోయాయి. వైసీపీ ప్రజాప్రతినిధుల అసమర్థ పాలనతో, నడివేసవిలో తాగునీటి కోసం తిరువూరు ప్రజలు అల్లాడుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణ జనాభా 70వేల వరకు ఉండగా, 18 కాలనీలు, 20 వార్డులు ఉన్నాయి. 5 పాత రక్షిత నీటిపథకాలు ఉండగా, గృహావసరాల కుళాయి కనెక్షన్లు 3వేల వరకు ఉన్నాయి. పబ్లిక్ కుళాయిలు 550 వరకు ఉండగా, 500 చేతిపంపులున్నాయి. ఇవేమీ తిరువూరు పట్టణ వాసుల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. శీతాకాలం, వేసవి కాలం అనే తేడా లేకుండా నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నారు. పట్టణం నలువైపులా వాగులు, చెరువులు, ఎన్ఎస్​పీ. కాల్వలు ఉన్నా తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతమున్న రక్షితనీటి పథకాల వల్ల ప్రజల తాగునీటి అవసరాలు తీరడం లేదు. కొన్ని వార్డులకు రెండ్రోజులకు ఒకసారి, మరికొన్ని వార్డులకు మూడ్రోజులకు ఒకసారి చొప్పున తాగునీరు అందిస్తున్నారు. వీటినే దాచుకుని ప్రజలు కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటడం వల్లే తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఎండాకాలమే కాదు - జగనన్న పాలనలో ఐదేళ్లూ నీటి కొరతే - Water Problems in Annamayya


మరోవైపు తరచూ పైపులైన్లు దెబ్బతింటుండగా, వాటిని మరమ్మతు చేయడానికి సిబ్బంది నానాపాట్లు పడుతున్నారు. నానాటికి విస్తరిస్తున్న పట్టణ జనాభాకు తగ్గట్లు తాగునీరు అందించడంలో పాలకుల్లో ప్రణాళిక లోపించింది. గత ప్రభుత్వంలో 110 కోట్ల రూపాయలతో ఫెర్రీ నుంచి పట్టణానికి తాగునీటిని అందించే ప్రయత్నాలు ఆగిపోయాయి. తర్వాత ఈ పథకాన్ని మరింత విస్తరించి అంచనాలను 164 కోట్లకు పెంచారు. 2022లో ఏఐబీబీ నిధులతో రెండు దశలుగా పనులు చేపట్టడానికి ఈ పథకానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ పనులు ప్రారంభ దశలోనే ఆటకెక్కాయి. పైపులైన్లు వేసి, రక్షితనీటి పథకం పునాదులకే పరిమితం చేసిన గుత్తేదారు పనులను అంసపూర్తిగా వదిలేశారు. కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఇప్పట్లో ఈ పథకం ద్వారా కృష్ణా జలాలు అందే పరిస్థితి కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పురపాలక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజలకు తాగునీరు సక్రమంగా అందడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఐటీ హబ్​లో నీటి సంక్షోభం- ఎన్నికలపై తీవ్ర ప్రభావం- ఓటర్లకు ముఖం చాటేస్తున్న అభ్యర్థులు - Lok Sabha Election 2024


పురపాలక మార్గదర్శకాల ప్రకారం పట్టణంలో మనిషి ఒక్కంటికి 135 లీటర్లు సరఫరా చేయాల్సి ఉండగా,ప్రస్తుతం 60 లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నారు. శివారు కాలనీలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. ఇది కూడా రెండ్రోజులకొకసారి తాగునీరు అందిస్తున్నారు. ఈ నీటిని స్థానికులు పట్టుకుని దాచుకుంటున్నారు. కొన్ని కాలనీలకు రెండు,మూడు నెలలకు ఒకసారి సైతం కుళాయిల ద్వారా తాగునీరు అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్యాంకర్లో, దగ్గర్లో ఉన్న బోర్లే శరణ్యమంటున్నారు స్థానికులు.
ఈ బెజవాడ నీళ్లను సీఎం జగన్, భారతి రెడ్డి తాగుతారా?: కేశినేని శ్రీదేవి ఫైర్ - water issue in Bejawada

Last Updated : Apr 25, 2024, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details