ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదు - సీఎం చంద్రబాబు హెచ్చరిక

వినియోగదారులు తినటం లేదు కాబట్టి రీసైక్లింగ్‌ పర్వాలేదన్న ధోరణి సరికాదు - చౌకబియ్యం రీసైక్లింగ్‌ తక్షణం ఆపాలన్న సీఎం చంద్రబాబు

CHANDRABABU
CM CBN ON PDS Rice (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Discussion on PDS Rice:పీడీఎస్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కలెక్టర్ల సదస్సులో బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై సీఎం మాట్లాడారు. కొందరు ప్రజలు చౌక దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యం తీసుకోవడం లేదని మంత్రులు చెప్పారు. మూడు చెక్ పోస్టులు ఉన్నప్పటికీ చౌక బియ్యం అక్రమ రవాణా ఎలా అయ్యిందని కాకినాడ కలెక్టర్​ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగారు. చౌక బియ్యంలో ఇతర బియ్యాన్ని కలిపేసి రవాణా చేశారన్న కలెక్టర్ షన్మోహన్ చెప్పారు. 13 కేసుల్లో 86 రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు.

కాకినాడ పోర్టులో 5 సార్టెక్స్ మిల్లులు: ఈ వ్యవహారంలో ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. డైల్యూషన్ చాలా తక్కువ ఉందని, అందుకే చౌక బియ్యం అక్రమ రవాణాను పట్టుకోవటం కష్టతరం అవుతోందని కలెక్టర్ షన్మోహన్ చెప్పారు. విశాఖ పోర్టులోనూ అక్రమంగా రవాణా చేస్తున్న చౌక బియ్యం పట్టుకున్నామని మంత్రి మనోహర్ చెప్పారు. కాకినాడ పోర్టులో 5 సార్టెక్స్ మిల్లులు నడుస్తున్నాయని, ఇది చాలా ఆశ్చర్య కరంగా ఉందని మంత్రి తెలిపారు. అక్కడే మిల్లింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నారని చెప్పిన మంత్రి మనోహర్ ఆక్షేపించారు.

అన్ని రాష్ట్రాల్లోనూ స్మగ్లింగ్ ఉంది:ప్రతీ బ్యాగ్​ను పట్టుకుని తనిఖీ చేయటం ఇబ్బందిగా ఉందని, అయితే నిరంతర తనిఖీల ద్వారా స్మగ్లింగ్ ఆగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తినే బియ్యాన్ని చౌక దుకాణాల ద్వారా ఇవ్వటం లేదని చెప్పిన మంత్రి పయ్యావుల తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వంతో పాటు ఎఫ్​సీఐ కూడా రీసైక్లింగ్‌ బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని పండించేలా తెలంగాణా ప్రయత్నిస్తోందన్న మంత్రి కేశవ్ తెలిపారు. ఏపీలో మాత్రమే చౌక బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం లేదని, అన్ని రాష్ట్రాల్లో ఉందన్న మంత్రి కేశవ్ స్పష్టంచేశారు.

రీసైక్లింగ్‌తక్షణం ఆపాలి: చౌక బియ్యం వ్యవహారంలో ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుందామని మంత్రులు, అధికారులు చెప్పారు. చౌక బియ్యం రీసైక్లింగ్‌ తక్షణం నిలుపుదల చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. వినియోగదారులు తినటం లేదు కాబట్టి రీసైక్లింగ్‌ పర్వాలేదన్న ధోరణి సరికాదని సీఎం తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిగా అధ్యయనం చేసి చర్యలు తీసుకుందామని తేల్చిచెప్పారు.

ధాన్యం కొనుగోలు సొమ్ము 24 గంటల్లోపే రైతులకు:అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోపే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గత ఐదు సంవత్సరాలుగా పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ అవుతూ పెద్దఎత్తున రైస్ స్మగ్లింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ వ్యవహారానికి వేదికగా కాకినాడ పోర్టు నిలిచిందన్నారు. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది భాగస్వామ్యులు అయ్యారని తెలిపారు.

ఇటువంటి అక్రమ కార్యక్రమాలను నియంత్రించేందుకు అవసరమైతే పీడీ యాక్టును కూడా వినియోగించాలని వెల్లడించారు. నియంత్రణ బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని స్పష్టం చేశారు. పీడీఎస్ రైస్​ను ప్రజలు తినడానికి ఇష్టపడని పక్షంలో, వారు ఇష్టపడే రకాన్ని రైతులు సాగు చేసేలా అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అలలపై ఊగిసలాటలా స్టెల్లా నౌక భవితవ్యం - 'సీజ్‌ ద షిప్‌' సాధ్యమేనా!

గోదాములో పీడీఎస్ రైస్ మాయం! - మాజీ మంత్రి పేర్నినాని భార్యపై కేసు

ABOUT THE AUTHOR

...view details