ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెనిఫిట్ షో, టికెట్ ధరలు చిన్న విషయాలు - సినీ ఇంటర్నేషనల్‌ హబ్‌గా హైదరాబాద్‌ మా లక్ష్యం : దిల్‌రాజు - DIL RAJU ON MEET WITH CM REVANTH

సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్​రాజు - ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్ల వెల్లడి

dil_raju_on_meet_with_cm_revanth
dil_raju_on_meet_with_cm_revanth (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2024, 3:40 PM IST

Updated : Dec 26, 2024, 4:30 PM IST

Dil Raju Spoke to Media after Meet with CM Revanth: తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశం అనంతరం దిల్‌ రాజు మీడియాతో మాట్లాడారు. సీఎంతో వీరు చర్చించిన విషయాలను వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఈ మీటింగ్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి తమకు కొన్ని విషయాల్లో దిశా నిర్దేశం చేశారని అన్నారు. సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. త్వరలోనే మరోసారి సీఎంతో భేటీ అవుతామని దిల్​రాజు చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి తమతో పంచుకున్నారని దిల్​రాజు తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలనే దానిపై చర్చించారని వెల్లడించారు. అందుకు అనుగుణంగా అందరం కలిసి వర్క్‌ చేస్తామని చెప్పారు. ఇండియన్‌ సినిమా వాళ్లే కాకుండా హాలీవుడ్‌ వాళ్లు కూడా హైదరాబాద్‌లో షూటింగ్స్‌ చేసుకునేలా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనే అంశంపై చర్చించారని అన్నారు. దానిపై చిత్రపరిశ్రమ మొత్తం మరోసారి చర్చించుకుని ఎఫ్‌డీసీ ద్వారా సీఎం సలహాలు, సూచనలు ఇస్తామని అన్నారు.

చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయడమే తమ అజెండా:హైదరాబాద్‌ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్‌ హబ్‌గా మార్చేందుకు అడుగులు వేస్తామని దిల్​రాజు అన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని వెల్లడించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా తాను బాధ్యతలు తీసుకుని వారం రోజులు అయిందని యూఎస్‌ వెళ్లి రాగానే సీఎంని కలిశానని తెలిపారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ ముఖ్యమని బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు అనేది చిన్న విషయమని అన్నారు. ఇంటర్నేషనల్‌గా తెలుగు చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయడం అనేది తమ అజెండా అని అన్నారు. సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్యవర్తిగా కమిటీలో సినీ పరిశ్రమతో పాటు మంత్రులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. 15 రోజుల్లో ఈ కమిటీ ఓ నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తుందని దిల్‌రాజు వివరించారు.

శ్రీతేజ్​ కుటుంబానికి పుష్ప టీమ్​ రూ.2 కోట్లు సాయం

"ఆ ఒక్కటి అడగొద్దు" - సినీ ప్రముఖులతో తేల్చిచెప్పిన సీఎం!

Last Updated : Dec 26, 2024, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details