Devotees Flocked in Large Numbers to Visit Tirumala:తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీపావళి పండుగ సెలవులకు వారంతపు సెలవులు కలిసి రావడంతో శ్రీవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తులు తాకిడి పెరగడంతో ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్ని పూర్తిగా నిండి వెలుపలకు వచ్చిన క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసారు. వెలుపల క్యూ లైన్లో ఉన్న భక్తులతో పాటు కంపార్ట్మెంట్ల షెడ్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు నిర్విరామంగా పానీయాలను సరఫరా చేస్తున్నారు. మరోవైపు రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది వాహన రాకపోకలను, వాహనాల పార్కింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.