ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

ETV Bharat / state

రాష్ట్రానికి కుంకీ ఏనుగులు- ఫలించిన పవన్ దౌత్యం - Pawan Kalyan On Kunki Elephants

Deputy CM Pawan Kalyan On Kunki Elephants: జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ విషయంపై పవన్‌ కల్యాణ్‌ కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే, అక్కడి అధికారులతో చర్చించారు. ఆమేరకు కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ- కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.

pawan_kalyan_on_kunki_elephants
pawan_kalyan_on_kunki_elephants (ETV Bharat)

Deputy CM Pawan Kalyan On Kunki Elephants:రాష్ట్రంలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకీ ఏనుగులను ఉపయోగించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఇటీవల పవన్‌ కల్యాణ్‌ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే, అక్కడి అధికారులతో చర్చించారు. కుంకీ ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు. ఆమేరకు ఇవాళ కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ- కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 కుంకీ ఏనుగులు దసరా తర్వాత ఏపీకి వస్తాయని పవన్ కల్యాణ్ తెలిపారు. అటవీశాఖ ఈ ఏనుగుల సమస్య బాగా డీల్ చేస్తుందని చెప్పారని తెలిపారు. ఏనుగులు పంట పొలాలను ధ్వసం చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏనుగులు తమిళనాడు, కర్ణాటక ఇలా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నాయని అన్నారు.

తిరుమల లడ్డూ వివాదం - వైరల్​ అవుతున్న ప్రకాష్​రాజ్​ వరుస పోస్టులు - Prakash Raj vs Pawan Kalyan

Karnataka Forest Minister Ishwar Khandre:అటవీ ప్రాంతాలు తగ్గడానికి మానవ చొరబాట్లు ప్రధాన కారణమని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పష్టం చేశారు. వాతావరణం పెనుమార్పులకు కేవలం గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే కారణం కాదని అడవుల నరికివేత, వ్యర్థాలను సరిగ్గా నిర్వహించ లేకపోవడం, వ్యవసాయం కోసం అటవీ ప్రాంతాల ఆక్రమణలు కారణంగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. అటవీ ప్రాంతాలు, జంతువుల సంరక్షణ కోసం ఆధునిక సాంకేతికత వినియోగించుకుని డేటా బేస్ రూపొందించామన్నారు. మొత్తం 9 అంశాల్లో ఏపీ- కర్ణాటక రాష్ట్రాలు ఉమ్మడిగా పని చేసేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రానికి కుంకీ ఏనుగులు- ఫలించిన పవన్ దౌత్యం (ETV Bharat)

చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు దాడులు చేశాయి. ఏనుగుల దాడులతో పంటలు ధ్వంసం అయ్యేవి. ఏనుగుల సమస్యలపై నాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ దాడులను ఎదుర్కొనే సమర్థత కర్ణాటక అటవీశాఖకు ఉందని తెలిసింది. ఏనుగుల దాడుల పరిష్కారం కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించాము. ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకీ ఏనుగులను ఇవ్వాలని కోరాము. మేం అడగ్గానే కర్ణాటక సీఎం, మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే సానుకూలంగా స్పందించారు. దేశంలో ఇంతవరకూ అటవీశాఖకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగలేదు.- పవన్‌ కల్యాణ్ డిప్యూటీ సీఎం

కర్ణాటక నుంచి ఏపీకి 8 కుంకీ ఏనుగులు - రాష్ట్రంలో గజరాజుల బెడదకు చెక్ - Pawan Kalyan on Kumki Elephants

భక్తుల మనోభావాలపై దాడి జరిగింది - ప్రశ్నించకుండా ఎలా ఉండగలం? - జగన్​పై పవన్​ తీవ్ర ఆగ్రహం - Pawan kalyan Deeksha

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details