Deputy CM Bhatti Vikramarka Discussion with Group 2 Candidates :సచివాలయంలో గ్రూపు -2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. గ్రూపు-2 అభ్యర్థులతో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ చర్చించారు. గ్రూపు -2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ ఛైర్మన్‌కు ఫోన్ చేసి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిసెంబరు నెలలో పరీక్ష నిర్వహణకు పరిశీలిస్తామని చెప్పారు.
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. అలాగే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నామని అన్నారు. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసులు పాలైతే మీరే నష్టపోతారని హెచ్చరించారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడొద్దన్నారు.
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు :విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నాం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసుల పాలైతే మీరే నష్టపోతారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడొద్దు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తాం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం." అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.