Delhi To Hyderabad Flight Diversion :దేశంలో ఇటీవల పలు విమానాలకు, పలు నగరాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బాంబు బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు బెదిరింపులు రావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎయిర్‌పోర్టుల్లో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విస్తారా విమానాన్ని దారి మళ్లించారు. మిగతా విమానాలు యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు - తనిఖీలు చేపట్టిన అధికారులు