Daughter Begging For Her Mother Funeral in Nirmal :నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్‌తరోడాలో ఆదివారం మనసులను కదలించే ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేరొల్ల గంగామణి(34)కి భైంసా మండలం కుంబి గ్రామానికి చెందిన వాసి నరేశ్‌తో 15ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కొంతకాలం బాగానే ఉన్న దంపతులకు కూతురు జన్మించింది. తరువాత మనస్పర్థలతో పదేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. దీంతో ఆ మహిళ కూతురితో పుట్టిన ఊరికే వచ్చి ఒంటరిగా ఉంటోంది. అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేసుకుంటా పాపని పోషిస్తోంది.
'నేనేం పాపం చేశానమ్మా నన్నొదిలి వెళ్లిపోయావ్' (ETV Bharat) కొన్నేళ్లుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తోంది. అదే పాఠశాలలో తన కూతరు దుర్గ కూడా 6వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు తనకుంటూ ఎవరూ లేని ఒంటరి జీవితమని కొన్ని రోజులుగా గంగ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శనివారం రాత్రి కూతురితో కలిసి భోజనం చేసి నిద్ర పోయింది. అయితే ఉదయం కూతురు దుర్గ లేచి చూసేసరికి తల్లి ఉరేసుకుని శవమై వేలాడి కనిపించడంతో బాలిక కేకలు వేసి బోరున విలపించింది. ఆమె రోదనతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై భానుసింగ్ మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇప్పుడు నేనెవరి దగ్గరకు వెళ్లాలి అమ్మా :అమ్మా నేనేం పాపం చేశానమ్మా నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయావు. ఇప్పుడు నాకంటూ ఎవరు ఉన్నారు అమ్మా. చెప్పమ్మా అంటూ ఆ బాలిక రోదన అక్కడి వారి గుండెలని పిండేసింది. ఏనాటికైనా వస్తాడని అనుకున్న తండ్రి కూడా నాలుగేళ్ల కిందట మరణించారు. ఇప్పుడు తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి, తండ్రి తరఫు బంధువులూ కూడా ఎవరూ లేరు. అనాథగా మారిన బాలిక తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలని రోదించిన తీరు అందరిచేత కంటతడి పెట్టించింది.
అనాథ విద్యార్థులకు వెంకట్ ఫౌండేషన్ చేయూత - పెద్దమనసు చాటుకున్న వ్యాపారి - Special Story On Venkat Foundation
అంత్యక్రియల కోసం భిక్షాటన : తల్లి మృతదేహాన్ని వదిలేసి, ఇంటి ముందు ఓ వస్త్రం వేసి దాని ఎదుట కూర్చొని తల్లి అంత్యక్రియల ఖర్చుల కోసం భిక్షాటన చేసింది. వచ్చిన డబ్బులతో కొడుకులా తల్లికి కొరివి పెట్టింది. గ్రామస్థులు, పోలీసులు తరఫు సీఐ మల్లేశ్, ఎస్సై సాయికిరణ రూ.8వేలు, టీచర్ గజానంద్ రూ.5వేలు అందించి మానవత్వం చాటుకున్నారు. అనాథగా మారిన బాలిక భవిష్యత్తు అంధకారంగా మారింది. ఆమెను మాననతావాదులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేరదీయాల్సిన అవరసం ఉంది.
భరోసా కల్పించిన మంత్రి కోమటిరెడ్డి :ఈ విషయం తెలుసుకున్నమంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు భరోసా కల్పించారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తన వంతుగా లక్ష రూపాయల నగదును తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీఓ అబ్దుల్ సమాద్ ద్వారా నగదును అందజేశారు. చిన్నారికి విద్యా పరంగా ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్లి అయ్యే వరకు బాధ్యత వహిస్తానని వీడియో కాల్‌లో వెల్లడించారు. ఖర్చులకు ప్రతి నెల డబ్బులు పంపుతానని, ఏదైనా అవసరం వస్తే తనకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనాథ బాలికను ఆర్థికంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే రామారావు పటేల్ హామీ ఇచ్చారు. ఆమె విద్యాభ్యాసానికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనాథగా మారిన బాలికకు కలెక్టర్ అభిలాష అభినవ్ వీడియో కాల్ చేసి ఓదార్చారు. తల్లి అంత్యక్రియల అనంతరం ఓ ఉపాధ్యాయుడు వచ్చి కలెక్టర్ వీడియో కాల్ మాట్లాడుతున్నారని చెప్పి ఫోన్ అమ్మాయికి ఇచ్చారు. ఎవరూ లేరని బాధపడొద్దు, ధైర్యంగా ఉండాలని, తామంతా ఆమెకు అండగా ఉంటామని చెప్పారు. బాగా చదువుకోవాలని, అన్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్ భరోసా కల్పించారు.
అనాథ యువతికి గ్రాండ్‌గా పెళ్లి చేసిన పోలీస్- వచ్చిన వారందరికీ రిటర్న్ గిఫ్ట్‌గా మొక్క! - Unique Weddings
సమాజ సేవకోసం పెళ్లికి నో- అంబులెన్స్‌తో వైద్య సేవలు- అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు! - Social Worker Satish Chopra