ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage - HOME APPLIANCES DAMAGE

Damage to Electronic And Home Appliances Due to Floods in Vijayawada : విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద వీడుతోంది. బాధితులకు వేదన ఉబికి వస్తోంది. ముంపు వీడుతున్న తరుణంలో చిరు వ్యాపారులు నుంచి ఇంట్లో ఉన్న గృహిణుల వరకు ఎవరిని కదిపిన సర్వం కొల్పోయామని ఘొల్లుమంటున్నారు. బుడమేరుకు పడిన గండి తమ బతుకు బండిని కుప్పకూల్చిందని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

HOME APPLIANCES DAMAGE
HOME APPLIANCES DAMAGE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 10:40 AM IST

Damage to Electronic And Home Appliances Due to Floods in Vijayawada :ఫ్రిజ్, టీవీ, వాషింగ్‌ మెషిన్‌ పేద, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటివన్నీ వన్‌టైం ఇన్వెస్ట్​మెంట్​! గృహోపకరణాలన్నీ ఒకేసారి కొనే స్థోమత లేక దఫదఫాలుగా కొంటుంటారు. కానీ అవన్నీ ఒకేసారి పాడైపోతే పరిస్థితేంటి? వాటితోపాటు ఉప్పులు,పప్పులూ, వంటపాత్రలూ పనికిరాకపోతే పరిస్థితేంటి? సంసారం మళ్లీ మొదటికొచ్చి నట్లే కదా! విజయవాడలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అప్పు చేసో, వాయిదాల పద్ధతుల్లోనో కొన్న సామాన్లన్నీ పాడైపోయాయి.

ఏ ఇంటికెళ్లినా దయనీయ పరిస్థితి : తడిసిన ఫ్రిజ్‌లు, టీవీలు, కూలర్లు, వాషింగ్‌ మెషిన్లు, టేబుల్‌ఫ్యాన్లు, ఇతర గృహాపకరణాలు. నీళ్లలో తేలియాడుతున్న పరుపులు, సోఫాలు. విజయవాడలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఇల్లు చూసినా ఇదే కష్టం. ఇదే నష్టం. హమ్మయ్య వరద తగ్గిపోయిందంటూ ఇంటితలుపులు తెరుస్తున్న బాధితులకు కన్నీళ్లు ఆగడం లేదు. ఇంట్లోని ప్రతీ ఎలక్ట్రానిక్‌ వస్తువూ బురదమయమైంది. వంట గదిలో ఉప్పులు, పప్పులు మొదలుకుని బెడ్‌రూమ్‌లో మంచాలు, పరుపుల వరకూ ఏదీ పనికొచ్చేలా లేదు.

ముగింపు దశకు చేరిన పునరుద్ధరణ పనులు - నేడు విజయవాడలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Vijayawada Gradually Recovering

ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి ప్రజలే :సింగ్ నగర్, రాజరాజేశ్వరీపేట, నందమూరి నగర్, వాంబేకాలనీల్లో ఎక్కువగా ఉండేది పేద, మధ్యతరగతి కుటుంబాలే! అధికశాతం చిరుద్యోగులు, రోజువారీ సంపాదనతో సంసార సాగరం ఈదుతున్న చిన్న జీవితాలే. అలాంటి జీవితాలు ఇప్పుడు మొదటికొచ్చాయి. కుటుంబాన్ని నడిపే కుట్టుమిషన్‌ కొట్టుకుపోయింది. టిఫెన్‌ బండి నడపడానికి అవసరమైన సామాగ్రి పాడైపోయింది. స్టేషనరీ దుకాణంలో కీలకమైన ప్రింటర్‌ పనిచేయనంటోంది. ఒకరేంటి చేతనైన పని చేసుకుంటూ సొంతకాళ్లపై నిలబడ్డామనుకున్న వాళ్ల కలలన్నీ కన్నీటిపాలయ్యాయి.

భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి - జలాశయాలకు పోటెత్తుతున్న వరద - HEAVY RAINS IN UTTARANDRA

అప్పుచేసో, వాయిదాల పద్ధతుల్లో కొనుగోలు :కాలానుగుణంగా ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల వినియోగం ప్రతీ ఇంట్లో పెరిగిపోయింది. చాలా మంది తలకుమించిన భారమైనా అప్పో సొప్పో చేసి కొనుగోలు చేస్తారు. మరి కొందరు నెలనెలా వాయిదాల్లో చెల్లించేలా కొంటుంటారు. ఇప్పుడు అలాంటివాళ్లకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ఈఎంఐలు కట్టక తప్పని పరిస్థితి. సరాసరిన ఒక్కో ఇంట్లో లక్ష నుంచి రెండు లక్షల వరకూ గృహోపకరాణాలుగానీ,ఫర్నీచర్‌గానీ వరదపాలైంది. ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలను ప్రభుత్వమే బాగుచేయించే ఏర్పాట్లు చేయడం కాస్త ఊరటనిస్తున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ సామాగ్రి కొనగలమా అనే ఆవేదన బాధితుల్లో కనిపిస్తోంది.

వరద నుంచి బయటపడుతున్న కాలనీలు - 7 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్​ - Vijayawada Gradually Recovering

ABOUT THE AUTHOR

...view details