ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా పెళ్లికి రండి అంటూ ఇన్విటేషన్‌ లింక్ వచ్చిందా? - క్లిక్​ చేశారో వలలో చిక్కినట్టే - WEDDING INVITATION FRAUD IN AP

వివాహ ఆహ్వాన పత్రిక పేరుతో వాట్సప్‌కు మోసపూరిత ఫైళ్లు - ఫైళ్లు, లింకులు డౌన్​లోడ్​ చేస్తే సైబర్‌ నేరస్థుల అధీనంలోకి ఫోన్‌

Cyber Fraud by Fake Digital Wedding Invitation
Cyber Fraud by Fake Digital Wedding Invitation (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 12:47 PM IST

Cyber Fraud by Fake Digital Wedding Invitation : ఒకప్పుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉంటే ఎంత దూరమైనా బంధువుల ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్​ మారింది. డిజిటల్‌ పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే లొకేషన్​ మ్యాప్స్​ లింక్​ ఇలా వాట్సప్​లో పంపించి ఆహ్వానిస్తున్నారు. ఈ టెక్నాలజీనే సైబర్​ నేరస్థులు సైతం తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక పేరుతో ఫోన్​కు సందేశాలు, ​ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ (APK) ఫైళ్లు పంపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వీటితో బాధితుల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే డిజిటల్‌ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ (Digital Wedding Invitation) పేరుతో మోసానికి పాల్పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. కొత్త ఫోన్​ నంబర్ల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, లింకులు క్లిక్​ చేయొద్దని, వాటిని డౌన్​లోడ్​ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

క్లిక్ చేశారా అంతే : గుర్తు తెలియని నంబర్లు, వాట్సప్, ఖాతాల నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌​ తదితరాలకు ఆహ్వాన పత్రికలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లింకులు, ఫైళ్లను సైబర్​ నేరస్థులు పంపిస్తారు. దీంతో ఎవరు పంపారనే ఆసక్తితో క్లిక్‌ చేస్తే మన ప్రమేయం లేకుండా ఫోన్​లోకి ఏపీకే ఫైల్‌ రూపంలో ఉండే యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఫోన్​ గ్యాలరీ, యాప్​లలోని డేటాతో సహా అన్ని రకాల అనుమతుల్ని ఈ మాల్​వేర్​ సొంతంగా దానంతట అదే తీసుకుంటుంది. ఇలా డిజిటల్‌ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌, వీడియోలు అని భావించి డౌన్‌లోడ్‌ చేస్తే ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ యాప్‌లు ఇన్‌స్టాల్‌ అయి ఫోన్‌ హ్యాక్‌ అవుతుంది.

'యూ ఆర్​ అండర్​ డిజిటల్​ అరెస్ట్​' పేరిట యువతికి రూ.1.25 కోట్ల టోపీ

దీంతో సైబర్​ నేరగాళ్లు పూర్తిగా మొబైల్​ ఫోన్​ను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దోచేస్తారు. ఫోన్​, కంప్యూటర్‌లోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి తరహా ఫిర్యాదులు అందకున్నా సైబర్​ నేరగాళ్లు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌, వీడియోలు, లింకులు, ఫైళ్లు పంపుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

'సైబర్​ నేరస్థులు లింకులు​ పంపించి వాటితో డబ్బులు కాజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫైళ్లు, లింక్​లు క్లిక్​ చేయవద్దు. వాటిని క్లిక్​ చేస్తే ఏపీకే ఫైల్​ డౌన్​లోడ్​ అవుతుంది. దీంతో యాప్​లు డేటా మొత్తం నేరగాళ్ల సర్వర్​కు చేరవేస్తాయి. ఆ లింక్​ను క్లిక్​ చేయగానే ఫోన్​ డేటా నేరగాళ్ల చేతుల్లోకి వెళుతుంది. కొత్త నంబర్ల నుంచి వచ్చే సందేశం ఏదైనా కచ్చితంగా తనిఖీ చేసుకోవాలి'- నల్లమోతు శ్రీధర్, సైబర్‌ నిపుణుడు

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • మొబైల్​ ఫోన్​కు ఏదైనా ఫైల్​ వచ్చినప్పుడు అది ఏ రకమైన ఫైల్​ అని చివరి అక్షరాలతో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వెడ్డింగ్​ ఇన్విటేషన్‌ పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ వస్తే 'ఇన్విటేషన్​.పీడీఎఫ్'​ అని ఆంగ్ల అక్షరాలతో వస్తుంది. అదే ఏపీకే ఫైల్​ అయితే 'వెడ్డింగ్ ఇన్విటేషన్‌.ఏపీకే' అని ఉంటుంది. ఏపీకే అని ఉన్న వాటిని ఎట్టి పరిస్థితిలోనూ డౌన్‌లోడ్‌ చేయవద్దు.
  • తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్​ అయినా ఒకసారి పరిశీలించాకే దాన్ని తెరవాలి.
  • ఏపీకే ఫైళ్లను క్లిక్​ చేసిన సమయంలో ప్రమాదకర ఫైల్​ తెరపై కనిపిస్తుంది. వాటిని డౌన్​లోడ్​ చేయవద్దు.

"నేను కూడా సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్టే" - ఆ నంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి : విశాఖ సీపీ

ABOUT THE AUTHOR

...view details